Ananth Ambani|త‌న కొడుకు పెళ్లి కోసం ఆస్తిలో 0.5 శాతం మాత్ర‌మే ముకేష్ అంబానీ ఖ‌ర్చు చేశాడా..!

Ananth Ambani| కొన్ని నెల‌లుగా ముకేష్‌- నీతూ అంబాని ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొన‌డం మ‌నం చూశాం. వారి ఆచారాల‌కి త‌గ్గ‌ట్టు ప్ర‌తి వేడుక‌ని కూడా గ్రాండ్‌గా నిర్వ‌హిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఎట్ట‌కేల‌కి జూలై 12న అనంత్ అంబాని- రాధిక మ‌ర్చంట్‌ల వివాహం అట్ట‌హాసంగా జ‌రిపించారు. దేశంలో ఎవ‌రు కూడా చేయ‌ని విధంగా ముకేష్ అంబాని త‌న కొడుకు పెళ్లి జ‌రిపించాడు. ఈ వివాహ వేడుక‌కి దేశాధినేత‌లు, అన్ని పా

Ananth Ambani|త‌న కొడుకు పెళ్లి కోసం  ఆస్తిలో 0.5 శాతం మాత్ర‌మే ముకేష్ అంబానీ ఖ‌ర్చు చేశాడా..!

Ananth Ambani| కొన్ని నెల‌లుగా ముకేష్‌- నీతూ అంబాని ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొన‌డం మ‌నం చూశాం. వారి ఆచారాల‌కి త‌గ్గ‌ట్టు ప్ర‌తి వేడుక‌ని కూడా గ్రాండ్‌గా నిర్వ‌హిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఎట్ట‌కేల‌కి జూలై 12న అనంత్ అంబాని- రాధిక మ‌ర్చంట్‌ల వివాహం అట్ట‌హాసంగా జ‌రిపించారు. దేశంలో ఎవ‌రు కూడా చేయ‌ని విధంగా ముకేష్ అంబాని త‌న కొడుకు పెళ్లి జ‌రిపించాడు. ఈ వివాహ వేడుక‌కి దేశాధినేత‌లు, అన్ని పార్టీల‌కి చెందిన రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ సెల‌బ్రిటీలు, క్రీడా ప్ర‌ముఖులు హాజ‌రై సంద‌డి చేశారు. ఇక శుక్రవారం రాత్రి పెళ్లి ఘట్టం ముగియ‌డంతో విందు మాత్రమే మిగిలివుంది. ఇవాళ (శనివారం) ఎంపిక చేసిన కొంతమంది సన్నిహిత అతిథులకు విందు కార్యక్రమాన్ని సిద్ధం చేశారు. రేపు (ఆదివారం) గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.

ముంబైలోని జియో వ‌ర‌ల్డ్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో జ‌రిగిన పెళ్లి వేడుక కోసం అంబానీ భారీ ఏర్పాట్లు చేయ‌డం మ‌నం చూశాం.. అయితే ప్రీవెడ్డింగ్ వేడుక‌ల కోస‌మే 2000 వేల ర‌కాలుగా పైగా వంట‌కాలు చేయించిన ముకేష్ అంబానీ, ఈ మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న వేడుక‌ల కోసం అంత‌కు మించి వంట‌కాల ఘుమ‌ఘుమ‌లు ఘుభాళించే వంట‌కాలు చేయిస్తున్నాడు. ఇక పెళ్లి వేదికకి భారీగానే ఖ‌ర్చు చేశాడు. మొత్తం లైటింగ్‌తో సెట్ వేయించాడు. వివాహం కోసం అంబానీ ఎంత ఖ‌ర్చు చేస్తున్నారు? అని ఫోర్బ్స్ అంచ‌నా వేసింది. వారి లెక్క ప్ర‌కారం అక్ష‌రాలా 5000 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు పోర్స్బ్ చెప్పుకొచ్చింది. అంటే ఇది అంబానీ నికర విలువ‌లో 0.5 శాతం మాత్ర‌మే. అంబానీ ఆస్తిలో ఈ ఐదువేల కోట్లు జూజూబీ అన్న‌ట్టే.

పెళ్లి కోసం వంద‌ల కోట్ల ఖ‌రీదుగల బంగారు ఆభ‌ర‌ణాలు, బంగారు చీరలు, నుదిటిన పాపిడి బొట్టు నుంచి కాలికి తొడిగే మెట్టు వ‌ర‌కూ ప్ర‌తీది కూడా బంగారంతో ఉండేలా వారు ప్లాన్ చేశారు. ఇక అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ ముహూర్తాన్ని దృక్‌గణితం ఆధారంగా రూపొందించిన సూర్యమాన పంచాంగం ప్రకారం పండితులు నిర్ణయించారు. దక్షిణ భారతదేశంలో చంద్రుడి కదలికలు.. ఉత్తర భారతదేశంలో సూర్యుడి కదలికల ఆధారంగా పంచాంగాన్ని రూపొందించారు. అందుకే ఆషాఢ మాసంతో సంబంధం లేకుండా ఒక శుభ ముహూర్తాన్ని చూసి వారి వివాహ తంతు జరిపిస్తున్నారు. అయితే పంచాంగం ప్రకారం కూడా ఈ ముహూర్తం మంచిదేనని పలువురు పండితులు చెబుతున్నారు.