Train Journey | దీపావళికి రైలు ప్రయాణం చేస్తున్నారా..? ఈ వస్తువులతో పట్టుబడితే జైలు శిక్ష తప్పదు..!!
Train Journey | పండుగల( Festivals ) సమయంలో ప్రతి ఒక్కరూ తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. వీరిలో చాలా మంది రైలు ప్రయాణాలు( Train Journey ) చేస్తుంటారు. రైలు ప్రయాణం చేసేటప్పుడు నియమ నిబంధనలు పాటించాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Train Journey | దీపావళి పండుగ( Diwali Festival ) మరో వారం పది రోజుల్లో రాబోతోంది. దీంతో ఇప్పటికే దీపావళి శోభ రానే వచ్చింది. దీపావళి( Diwali ) షాపింగ్స్ ప్రారంభమయ్యాయి. కొత్త బట్టలతో పాటు పటాకులు( Crackers ) కొంటున్నారు. ఇక దసరా( Dasara )కు వెళ్లినట్టే.. దీపావళికి కూడా చాలామంది తమ సొంతూళ్లకు వెళ్తారు. ఇందుకు చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. రైలు ప్రయాణం చేసేవారు తమతో పాటు పటాకులను కూడా తీసుకెళ్తుంటారు. ఇక్కడే అసలు సమస్య ఉంది.
రైళ్లల్లో పటాకులను తరలించడంపై కఠిన నిషేధం ఉంది. ఇండియన్ రైల్వేస్( Indian Railways ) నిబంధనల ప్రకారం రైలులో ప్రయాణికులు( Train Passengers ) ఎలాంటి పటాకులను తీసుకెళ్లకూడదు. నిషేధిత వస్తువులతో ప్రయాణిస్తున్నట్లు తేలితే, రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం చర్య తీసుకోవలసి ఉంటుంది. జరిమానా లేదా జైలు శిక్ష.. రెండు కూడా విధించే అవకాశం ఉంటుంది.
మూడేండ్ల జైలు శిక్ష..!
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం.. ప్రయాణ సమయంలో ఒక ప్రయాణీకుడు ఏదైనా నిషేధిత వస్తువులను తీసుకువెళితే, అతనిపై రైల్వే చట్టం( Railway Act )లోని సెక్షన్ 164 ప్రకారం చర్య తీసుకోవచ్చు. ఈ సెక్షన్ కింద ప్రయాణికుడికి రూ.1000 జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. పటాకులు నిషేధిత వస్తువుల కేటగిరీ కిందకు వస్తాయి కాబట్టి, రైలులో వీటిని పట్టుకుంటే మీరు శిక్షకు అర్హులవుతారు. రైలు ప్రయాణికుల భద్రతకు హాని కలిగించే అనేక వస్తువులను రైలులో తీసుకెళ్లడాన్ని రైల్వే నిషేధించింది. ఇవి రైలులో అగ్ని ప్రమాదాన్ని సృష్టించే అవకాశం ఉంది.
ఈ వస్తువులు నిషేధం..!
స్టవ్‌లు, గ్యాస్ సిలిండర్‌లు( Gas Cylinders ), మండే రసాయనాలు( Chemicals ), బాణసంచా( Crackers ), యాసిడ్( Acid ), దుర్వాసన వచ్చే వస్తువులు, తోలు, ప్యాకేజ్‌లలో తెచ్చిన నూనె లేదా గ్రీజు వంటి ప్రయాణికులకు నష్టం కలిగించే వస్తువులు రైలు ప్రయాణ సమయంలో నిషేధించింది రైల్వే. నిబంధనల ప్రకారం.. రైలులో ప్రయాణికులు 20 కిలోల వరకు నెయ్యి( Ghee ) తీసుకెళ్లవచ్చు. అయితే నెయ్యిని సరిగ్గా టిన్ బాక్స్‌లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది.