పట్టుదల, సుసంకల్పానికి తోడు దైవానుగ్రహం ఉంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేసుకోవచ్చనడానికి ఓ యువకుడి సైకిల్ యాత్ర నిదర్శనంగా నిలిచింది. అస్సాంలోని నల్బారీ ప్రాంతానికి చెందిన పంకజ్ దేకా.. శివుడిపై అపార భక్తితో కేదార్ నాథుడిని దర్శించుకోవడానికి సైకిల్ పై బయలుదేరి తన సంకల్పాన్ని సాకారం చేసుకున్నాడు. అస్సాం నుంచి సైకిల్‌పై ఏకంగా 2,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కేదార్‌నాథ్ క్షేత్రానికి చేరుకుని శివయ్యను దర్శించుకుని సంకల్పం ఉంటే వేయిమైళ్ల ప్రయాణ దూరాన్ని అధిగమించవచ్చని నిరూపించాడు.
శివుడి పై భక్తితో మొదలైన సాహస యాత్ర
కఠినమైన హిమాలయ మార్గాలు, అనూహ్యంగా మారిపోయే ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ పంకజ్ దేకా చేసిన ఈ సాహసోపేత యాత్ర వేలాది మందికి స్ఫూర్తిగా నిలిచింది. అస్సాంలోని నల్బారీ ప్రాంతానికి చెందిన పంకజ్ దేకాకు చిన్నప్పటి నుంచి శివుడంటే అపారమైన భక్తి. కేదార్‌నాథ్‌లోని పరమశివుడిని దర్శించుకోవాలనేది అతని జీవితకాలపు కల. అయితే తన యాత్ర ఆధ్యాంతం ఓ తపస్సులా సాగాలకున్న పంకజ్ అందుకు సైకిల్‌తో కేదారినాథ్ యాత్రకు సిద్ధమయ్యాడు. ఓ టెంట్, తన పెంపుడు కుక్కతో సైకిల్ యాత్ర ప్రారంభించాడు. పరిమిత వనరులతోనే నల్బారీ నుంచి ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. యాత్రలో పెట్రలో బంక్ లు, దేవాలయాల వద్ద టెంట్ వేసుకుని బస చేస్తూ ముందుకు సాగాడు. దారిపొడవునా ఎదురైన ఎముకలు కొరికే చలి, ఆకస్మిక వర్షాలు, మంచు తుఫానులు, ఆక్సిజన్ స్థాయిలు తగ్గే ఘాట్ రోడ్లను అతను కేవలం తన మనోనిబ్బరంతో అధిగమించాడు. దారిలో ఎదురైన ప్రతి కష్టాన్ని “హర హర మహాదేవ్” అంటూ శివస్మరణతో అధిగమిస్తూ ముందుకు సాగాడు. 45 రోజులలో కేధార్ నాథ్ చేరుకున్నాడు.
శివయ్య దర్శనంతో పరవశించిన పంకజ్
కేదార్ నాథుడి దర్శనంతో శివనామస్మరణతో పంకజ్ దేకా పరవశించిపోయాడు. తన సుదీర్ఘ, కఠినమైన సైకిల్ యాత్ర విజయవంతంగా ముగియడంతో ఆలయ ప్రాంగణంలో శివుడికి మోకరిల్లి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. అతని సాహస యాత్రను, భక్తీ పారవశ్యాన్ని చూసిన తోటి యాత్రికులు సైతం ఆశ్చర్యపోయి, అతడిని అభినందించారు. పంకజ్ దేకా తిరిగి నాలుగు నెలల తర్వాతా స్వస్థలానికి చేరుకున్నాడు. నేటి ఆధునిక కాలంలో పబ్ లు, డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం, పార్టీలు, జల్సాలు, విహార యాత్రల టూర్ల మోజులో కొట్టుకపోయే యువతకు పంకజ్ దేకా సాగించిన ఆధ్యాత్మిక యాత్ర ఒక గొప్న ఆదర్శనీయంగా నిలిచింది. సోషల్ మీడియా వేదికగా యువ ఆధ్యాత్మిక యోధుడు పంకజ్ సాధించిన ఈ వినూత్న ఘనతపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
2,000 కి.మీ. సైకిల్ యాత్రతో కేదార్‌నాథ్ చేరిన యువకుడు! 🙏
అస్సాంలోని నల్బారీకి చెందిన పంకజ్ దేకా పరమశివుడిపై ఉన్న భక్తితో ఏకంగా 2,000 కి.మీ. సైకిల్‌పై ప్రయాణించి కేదార్‌నాథ్ ధామానికి చేరుకున్నాడు. హిమాలయాల కఠిన మార్గాలను అధిగమించి తన సంకల్పాన్ని సాకారం చేసుకున్న ఆయన యాత్ర… pic.twitter.com/6Y5mr8x2hb
— Tone News (@ToneNewsLive) July 15, 2026
