• Telugu News
  • /National

చార్ ధామ్ యాత్ర ఘాట్ రోడ్డుల్లో ట్రాఫిక్ జామ్..వీడియో వైరల్

చార్ ధామ్ యాత్ర రద్దీతో జోషిమఠ్ సమీపంలో 30 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హిమాలయ మార్గాల్లో వేలాది వాహనాల బారులు వైరల్‌గా మారాయి.

Reported by: Tejaswini Nanna | జాతీయం | May 30, 2026, 3:54 pm IST
Read Time: 3 mins
చార్ ధామ్ యాత్ర ఘాట్ రోడ్డుల్లో ట్రాఫిక్ జామ్..వీడియో వైరల్

హిందువులు ఎంతో ప్రాధాన్యతగా భావించే చార్ ధామ్ యాత్ర లక్షల మంది భక్తులు రద్దీతో కొనసాగుతుంది. అయితే హిమాలయ మార్గాల్లోని కొండలు, లోయల మీదుగా కొనసాగే చార్ ధామ్ యాత్రలో వాహనాల రద్దీ అధికమవ్వడంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు భక్తులకు ఎదురవుతున్నాయి. హిమాలయ కొండలు, లోయ మార్గాలన్ని కూడా బారులు తీరిన వేలాది వాహనాలతో చీమల బారులను తలపిస్తున్నాయి.

నియంత్రణ లేని చార్ ధామ్ యాత్ర రద్దీ వల్ల జోషిమఠ్ సమీపంలో 30కిలో మీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి హిమాలయ కొండలు పార్కింగ్ లాట్‌లా మారాయి. ఈ పరిస్థితి హిమాలయాలలో సున్నితమైన పర్యావరణాన్ని దెబ్బతీస్తూ, జోషిమఠ్ లాంటి ప్రాంతాల మనుగడకే ముప్పుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంత భారీ ట్రాఫిక్ సమయంలో అనుకోకుండా ఆకస్మిక వర్షాలు పడితే కొండ చరియాలు విరిగిపడి, ఆకస్మిక వరదలతో భారీ నష్టం కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చార్ ధామ్ యాత్రలో వాహనాల సంఖ్యపై తక్షణ నియంత్రణ అవసరమని ప్రకృతి ప్రేమికుల అభిప్రాయపడుతున్నారు. చార్ ధామ్ యాత్రలో సొంత వాహనాల కంటే పబ్లిక్ ట్రాన్స్ పోర్టును పూర్తిగా అమలు చేయడం ఉత్తమం అన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి.