దేశంలో కొనసాగుతున్న పెళ్లీళ్ల సీజన్ లో అనేక సిత్రాలు వెలుగుచూస్తున్నాయి. హర్యానాలోని కైథల్‌లో ఇంకొన్ని క్షణాల్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు హఠాత్తుగా పెళ్లి పీటల మీద నుంచి పారిపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పెళ్లి మండపంలో బంధుమిత్రులు,అతిధుల సమక్షంలో వివాహ వేడుక కొనసాగుతున్న క్రమంలో వరుడికి ఒక అపరిచిత నంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తన మాజీ ప్రేమికురాలని ఆ ఫోన్ లో అవతలి వ్యక్తి చెప్పాడు. అంతేకాకుండా వాట్సాప్ ద్వారా వారిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా పంపాడు.
ఆ ఫోటోలు చూసిన వెంటనే వరుడు వెంటనే ఆగ్రహంతో పెళ్లి మండపం నుండి పరుగెత్తడం ప్రారంభించాడు. ఆ తర్వాత వధువు, ఆమె కుటుంబ సభ్యులు, పెళ్లి బృందం అతన్ని వెంబడించారు. పెళ్లి కొడుకు దుస్తుల్లోనే వరుడు రోడ్డు మీదుగా పరుగెత్తుతుండటం..అతడిని పెళ్లి దుస్తుల్లోనే ఉన్న వధువు, ఆమె కుటుంబ సభ్యలు వెంటాడుతూ…బతిమాలడుతుండటం వీడియోలో కనిపిస్తుంది. ఆటో-రిక్షాలు, కార్లు, చుట్టుపక్కల జనం మధ్యలో వరుడి వెంట పడి..వారు ఎంత ప్రార్థించినప్పటికి పెళ్లికొడుకు వినిపించుకోకుండా ఆగ్రహంతో వారికి చిక్కకుండా పరుగెత్తడం..అతడిని పట్టుకునేందుకు వెనకాలే వధువు, ఆమె కుటుంబ సభ్యులు పరుగెత్తిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
అయితే ఇదంతా ఒక నిజమైన సంఘటనలా కాకుండా రీల్ లేదా సినిమా షూటింగ్‌ను పోలి ఉందని, సోషల్ మీడియా కంటెంట్ కోసం ముందే రాసిపెట్టిన స్క్రిప్ట్ మేరకు లేదా నాటకీయంగా చిత్రీకరించినట్లుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.పెళ్లి కూతురు కూడా వధువు వెంటపడటం చూస్తే ఇదంతా ఓ రీల్ మాదిరిగా కనిపిస్తుందంటున్నారు.
हरियाणा के कैथल में शादी के मंडप से दूल्हा अचानक भागा, रिपोर्ट्स के अनुसार, कैथल में शादी समारोह के दौरान दूल्हे को एक अनजान नंबर से फोन आया।
कॉल करने वाले ने दावा किया कि जिस लड़की से उसकी शादी हो रही है, वह उसकी एक्स है, और कुछ फोटो भी व्हाट्सएप पर भेज दिए।
बताया जा रहा है… pic.twitter.com/dcTtjNGOJp
— Mandeep RajBhar (@MandeepRajBhar9) July 7, 2026
