Calcutta High Court | బెంగాల్‌లో 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు

010 తర్వాత జారీ చేసిన ఓబీసీ కుల ధృవీకరణ పత్రాలను రద్దు కలకత్తా హైకోర్టు బుధవారం (22.5.2024) రద్దు చేసింది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం 2011లో బెంగాల్‌లో అధికారంలోకి వచ్చింది.

  • By: Somu |    national |    Published on : May 22, 2024 6:01 PM IST
Calcutta High Court | బెంగాల్‌లో 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు

కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు
ఇది బీజేపీ కుట్ర.. రిజర్వేషన్లు కొనసాగుతాయి
తేల్చి చెప్పిన బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

కోల్‌కతా: 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ కుల ధృవీకరణ పత్రాలను రద్దు కలకత్తా హైకోర్టు బుధవారం (22.5.2024) రద్దు చేసింది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం 2011లో బెంగాల్‌లో అధికారంలోకి వచ్చింది. కనుక.. మమతాబెనర్జీ ప్రభుత్వం హయాంలో జారీ అయిన అన్ని ఓబీసీ కుల ధృవీకరణ పత్రాలు చెల్లవు. అయితే.. కలకత్తా హైకోర్టు ఆదేశాలను తాము ఆమోదించేది లేదని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చెప్పారు. ఇది బీజేపీ చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ రిజర్వేషన్‌ కోటా కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

ఇంటింటి సర్వే నిర్వహించి, తాము ఈ బిల్లు తీసుకొచ్చామని, దానికి క్యాబినెట్‌, అసెంబ్లీ ఆమోదం లభించిందని ఆమె గుర్తు చేశారు. ‘కేంద్ర సంస్థలను ఉపయోగించి వీటిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేసింది. ఇంతటి దార/ మమతా బెనర్జీ ఆరోపించారు. ఇంత సిగ్గుమాలిన పనికి కాషాయ పార్టీ ఎలా సాహసించింది?’ అని ఆమె ప్రశ్నించారు. తృణమూల్‌ సర్కార్‌ తెచ్చిన చట్టంలోని అంశాలను సవాలు చేస్తూ దాఖలైన కేసులో కోర్టు సదరు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఓబీసీ క్యాటగిరీలో ఉద్యోగాలు పొందిన లేదా, ఎంపికైన వారిని ఈ తీర్పు ప్రభావితం చేయబోదని కోర్టు పేర్కొన్నది.