ఉదయనిధి స్టాలిన్‌కు చెన్నై హైకోర్టు ఊరట

సీఎం విజయ్, నటి త్రిషపై వ్యాఖ్యల కేసులో అరెస్టైన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు చెన్నై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది.

సీఎం విజయ్‌, నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టయిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట లభించింది. మద్రాస్‌ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. ఉదయ్ నిధి విడుదలకు ఆదేశించింది.

ఉదయనిధిని మంగళవారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఉదయ నిధి దాఖలు చేసిన బెయిల్ పిటిషన ను విచారించిన చెన్నై హోకోర్టు వెంటనే ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఎఫ్ఐఆర్ నమోదైనందునా విచారణ చేస్తున్నామని, విచారణ తర్వాత విడుదల చేస్తామని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. ఇరువర్గాల వాదనల విన్న హైకోర్టు ఉదయ్ నిధికి బెయిల్ మంజూరు చేసింది.

Latest News