CM MK Stalin : తమిళనాడులో హిందీకి ఎప్పటికి స్థానం ఉండదు
"హిందీకి తమిళనాడులో చోటు లేదు!" - సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు. అమరవీరుల దినోత్సవం వేళ భాషా పోరాటాన్ని గుర్తుచేస్తూ కేంద్రంపై నిప్పులు చెరిగిన డీఎంకే నేత..
విధాత : తమిళనాడులో హిందీకి ఎప్పుడూ స్థానం లేదని, భవిష్యత్తులోనూ ఉండదని డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టంచేశారు.హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించవన్నారు. ఆదివారం నిర్వహించిన తమిళ భాషా అమరవీరుల దినోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1965లో తమిళనాడులో నెలకొన్న హిందీ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ నిరసనల్లో ప్రాణత్యాగం చేసిన తమిళ భాషా అమరవీరులకు నివాళులు అర్పించారు. హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, తమిళ భాషా పరిరక్షణ కోసం 1965లో తమిళనాడులో భారీ ఉద్యమంలో ఎంతోమంది ఆందోళనకారులు తమ ప్రాణాలర్పించారు. అమరవీరుల త్యాగాలకు గుర్తుగా తమిళనాడు ప్రభుత్వం గత ఏడాది నుంచి జనవరి 25 వ తేదీని తమిళ భాషా అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తోంది.
ఈ సందర్బంగా స్టాలిన్ మాట్లాడుతూ తమిళ ప్రజలు హిందీకి వ్యతిరేకంగా గతంలో తీవ్ర పోరాటం చేశారని స్టాలిన్ గుర్తుచేశారు. హిందీని తమపై రుద్దాలని చూసిన ప్రతిసారీ.. అదే తీవ్రతతో తమ నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు.
జాతీయ విద్యావిధానాన్ని అమలుచేయడం లేదన్న కారణంతో కేంద్రం తమిళనాడుకు రావాల్సిన నిధులను నిలిపివేస్తోందని స్టాలిన్ ఆరోపించారు. అయినప్పటికీ ఈ విషయంలో తాము వెనకడుగు వేయమన్నారు.తమిళ భాషను రాష్ట్ర ప్రజలు ప్రాణంగా ప్రేమిస్తారని, దానిని మరుగుపరిచే ఎలాంటి చర్యనైనా తాము ఎన్నటికీ సహించమని చెప్పారు. త్రిభాషా విధానంపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్టాలిన్ మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తీసుకరావడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
மொழிப்போர்த் தியாகிகள் வீரவணக்க நாள்: அன்றும் இன்றும் என்றும் இந்திக்கு இங்கே இடமில்லை!
மொழியை உயிராய் நேசிக்கும் ஒரு மாநிலம், இந்தித் திணிப்புக்கு எதிராக ஒன்றுதிரண்டு போராடியது. திணித்த ஒவ்வொரு முறையும் அதே வீரியத்தோடு போராடியது.
இந்தியத் துணைக் கண்டத்திலுள்ள பல்வேறு மொழிவழித்… pic.twitter.com/EmVm1TqTXy
— M.K.Stalin – தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) January 25, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram