మాజీ సీఎం స్టాలిన్ తో సీఎం విజయ్ భేటీ

తమిళనాడు సీఎం విజయ్ మాజీ సీఎం స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర రాజకీయాల మధ్య ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకోగా, పలు కీలక అంశాలపై చర్చించారు.

టీవీకే చీఫ్, తమిళనాడు నూతన సీఎం సీ. జే. విజయ్ సోమవారం డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్‌ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. స్టాలిన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు. తమ భేటీలో వారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

రాష్ట్ర ఖజానాను గత డీఎంకే ప్రభుత్వం ఖాళీ చేసిందని ఇప్పటికే విజయ్‌ ఆరోపించారు. దీనికి స్టాలిన్‌ కూడా కౌంటర్ ఇచ్చారు. అప్పులు పరిమితికి లోబడే ఉన్నాయన్నారు. కొవిడ్‌ లాంటి విపత్తును ఎదుర్కొని, నిధులు ఇవ్వడంలో అడ్డంకులు సృష్టించిన బీజేపీని తట్టుకుని దీటుగా నిలబడ్డామని స్టాలిన్ తెలిపారు. ఈ నేపథ్యంలో విజయ్, స్టాలిన్ ల సమావేశం ఆసక్తి రేపింది.

పీఎంకే లీడర్ అన్బుమణి రామదాస్ ను కలిసిన సీఎం విజయ్

​ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. మాజీ సీఎం స్టాలిన్ ను కలిసిన అనంతరం పీఎంకే లీడర్ అన్బుమణి రామదాస్ ను సీఎం విజయ్ కలిశారు. అనంతరం విజయ్ ..ఎండీఎంకే చీఫ్ వైగోను ఆయన నివాసంలో కలిశారు.

కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం..

తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. అయితే నిన్న మంత్రిగా ప్రమాణం చేసిన టీవీకే నాయకురాలు కీర్తన.. నేడు ఎమ్మెల్యేగా తొలుత ప్రమాణస్వీకారం చేయలేకపోయారు. ఎలక్షన్ సర్టిఫికేట్‌ను తీసుకురాకపోవడంతో ఆమె ప్రమాణం చేయలేకపోవడంతో … తర్వాత ఇంటికి వెళ్లి ఆమె దానిని తీసుకొచ్చి, సమర్పించడంతో ఎట్టకేలకు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. మే 13న విజయ్ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది.

ఇవి కూడా చదవండి :

బండి సంజయ్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసులివ్వాలి : ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్
దేశ ప్రజలకు మోదీ సూచనల్లో మతలబు ఏమిటీ ?

Latest News