Crow Plays Football | ఆటలు మనషులు ఆడడమే చూశాం.. కానీ కొన్నిసార్లు జంతువులు( Animals ), పక్షులు( Birds ) కూడా ఆడుతాయి. క్రీడా మైదానాలను పక్షులు, జంతువులు ఆక్రమించుకుంటాయి. క్రీడాకారుల( Players ) మాదిరే అవి కూడా ఆడేందుకు ఉత్సాహం చూపిస్తాయి. ఆ మాదిరిగానే ఓ కాకి( Crow ) కూడా తన సాధ్యం కాని ఆటను ఆడింది. ఆ కాకి ఆటకు క్రీడాకారులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఎంతో ప్రసిద్ధి గాంచిన ఫుట్ బాల్( Foot Ball ) గేమ్‌పై ఓ కాకి దృష్టి పెట్టినట్లుంది. అదేదో ఫుట్ బాల్ శిక్షణ తీసుకున్నట్టు ఓ సాధారణ ప్లేయర్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఎంతో నైపుణ్యంతో ఫుట్ బాల్ ఆడింది. ఓ ఇంటి వరండాలో వాలిన కాకి( Crow ).. అక్కడున్న బాలుడితో ఫుట్ బాల్ ఆడింది. ఆ బాలుడు తన కాలితో బాల్‌ను నెట్టగా.. కాకి కూడా అదేస్థాయిలో బాల్‌ను బాలుడి వైపు నెట్టింది. అయితే తన కాలితో కాదు నెట్టింది.. తన ముక్కుతో నెట్టింది కాకి. ఓ 50 సెకన్ల పాటు కాకి ఫుట్ బాల్ ఆడి క్రీడాకారులు, నెటిజన్ల మనసును దోచుకుంది.
కాకి నైపుణ్యానికి ఫుట్ బాల్ క్రీడాకారులు ఫిదా అవుతున్నారు. ఎలాంటి శిక్షణ లేకుండా ప్రొఫెషనల్ ఫుట్ బాలర్ మాదిరి నెమ్మదిగా బాల్‌ను నెట్టడాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
🎥 | WATCH : A crow seen playing football with a kid in Goa. ⚽️🐦⬛ #90ndstoppage
– FOOTBALL, IT’S IN THE BLOOD OF GOANS! 💙
— 90ndstoppage (@90ndstoppage) May 21, 2025