దేశంలోని నగరాల్లో ఇటీవల హెచ్ఐవీ(ఎయిడ్స్) వ్యాధి విస్తరణ చెందుతుండటం..ముఖ్యంగా జెన్ జీ విద్యార్ధులు, యువతలో ఎక్కువగా హెచ్ఐవీ కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన రేపుతుంది. . 18నుంచి 25ఏళ్ల వయసు వారిలోనే ఎక్కువగా హెచ్ఐవీ బాధితులు కనిపిస్తుండటం తల్లిదండ్రులతో పాటు జాతీయ వైద్య, ఆరోగ్య శాఖను కూడా కలవర పెడతుంది. తాజాగా బెంగుళూరులో 7వేల మంది విద్యార్ధులకు హెచ్ఐవీ లక్షణాలు సోకడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. 18-35 ఏళ్ల వయసు వారిలో హెచ్‌ఐవి కేసులు పెరుగుతున్నాయని కర్ణాటక అధికారులు ధృవీకరించారు. అసలు యువతలో ఎందుకు ఇటీవల హెచ్ఐవీ పెరుగుతుందన్నదానిపై బెంగుళూరుకు చెందిన ప్రముఖ గైనకాలాజిస్టు కీలక అంశాలు వెల్లడించారు.
డేటింగ్ యాప్స్ తోనే హెచ్ ఐవీ విస్తరణ..
డేటింగ్ యాప్స్ వాడకంతో యువతలో అసురక్షిత లైంగిక సంబంధాలు పెరిగి HIV, STD వ్యాధులు తీవ్రమవుతున్నాయని గైనకాలజిస్ట్ డాక్టర్ దీపా నంబియార్ హెచ్చరించారు. క్షణిక ఆనందం కోసం తెలియని వారితో శారీరకంగా కలవడం వల్ల ప్రాణాలకే ముప్పు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 19 నుంచి 20 ఏళ్ల యువతుల్లో పెల్విక్, జెనైటల్ ఇన్‌ఫెక్షన్ల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని వెల్లడించారు. డేటింగ్ యాప్‌లు కాంటాక్ట్ ట్రేసింగ్‌ను క్లిష్టతరం చేస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక సుఖం కోసం జీవితాలను ప్రమాదంలోకి నెట్టొద్దని, యువత సురక్షితమైన నిర్ణయాలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.
హెచ్ ఐవీ అదుపుకు చికిత్స కన్నా నివారణకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అనామక కలయికల కోసం హింజ్, బంబుల్, టిండర్ వంటి యాప్‌లను ఆశ్రయించవద్దని, అలాంటి అసాంఘిక యాప్ లను కట్టడి చేయాలని సూచించారు. జీవితకాలపు అనారోగ్య ప్రమాదాలను నివారించడానికి సురక్షితమైన నిర్ణయాలు తీసుకోవాలని యువతకు స్పష్టం చేశారు.
