కేజ్రీవాల్‌కు బెయిల్ పొడిగింపు తిరస్కరించిన… ఢిల్లీ కోర్టు
లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పొడిగింపు అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ అభ్యర్ధించారు.

విధాత, హైదరాబాద్ : లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పొడిగింపు అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ అభ్యర్ధించారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసి బుధవారం వెల్లడించింది. మధ్యంతర బెయిల్ పొడిగింపును నిరాకరించిన కోర్టు జూన్ 19 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది.
జైలు అధికారులు ఆయన వైద్య అవసరాలు చూసుకోవాలని కోర్టు ఆదేశించింది. లిక్కర్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్ధనను అంగీకరిస్తూ.. కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు జూన్ 2న తిరిగి తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. కోర్టు కేజ్రీవాల్ బెయిల్ పొడిగింపు నిరాకరించి కస్టడీ పొడిగించడంతో జూన్ 19వరకు జైలులోనే ఉండనున్నారు.