భర్తపై వరకట్నం కేసు బనాయించి..కోర్టును విడాకుల కోసం ఆశ్రయించిన ఓ భార్య తన తండ్రి అనారోగ్యం సందర్బంగా భర్త వ్యవహరించిన తీరుతో తప్పు తెలుసుకుని అతడిని అలింగనం చేసుకున్ని కన్నీటిపర్యంతమైన ఘటన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఢిల్లీకి చెందిన శిఖా సింగ్ కు సౌరభ్ తో 2020లో వివాహం జరిగింది. ఆమె స్వయంగా తన భర్తతో గొడవపడి, అతనిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ కేసు కొనసాగుతున్న క్రమంలో ఆమె తండ్రి కూతురి కేసు కోసం తన వద్ద ఉన్న డబ్బునంతా ఖర్చు చేసి రోడ్డున పడ్డారు. కేసు ఖర్చులు, జీవన వ్యయం తదితర సమస్యతో తండ్రి ఇల్లు అమ్ముకోవాల్సి రాగా… వారు వీధి పాలయ్యారు. చివరకు తన అనారోగ్యానికి వైద్య చికిత్సలు కూడా పొందలేని దారుణ స్థితికి ఆమె తండ్రి చేరుకున్నాడు. పెరిగిన మానసిక, ఆర్థిక, అనారోగ్య ఒత్తిళ్ల మథ్య శిఖా తండ్రికి పది రోజుల క్రితం గుండెపోటు కూడా వచ్చింది.
పరిస్థితి విషమంగా ఉండగా.. ఆయనను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలిసిన శిఖా భర్త సౌరభ్ వెంటనే ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మెరుగైన చికిత్స కోసం తన మామను అక్కడి నుండి డిశ్చార్జ్ చేయించి, గుర్‌గావ్‌లోని అతిపెద్ద ఆసుపత్రులలో ఒకటైన ‘మేదాంత’ (Medanta)లో చేర్పించాడు. ఇప్పుడు ఆమె తండ్రి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. ఇంతలో ఢిల్లీ కోర్టులో ఆమె విడాకుల కేసు విచారణకు వచ్చింది. కోర్టులో భర్త సౌరభ్ ను చూడగానే.. జరిగిన పరిణామలను అన్నింటిని తలుచుకుని పశ్చాత్తాపానికి, తీవ్ర భావోద్వేగాని లోనైంది. ఆమె విడాకుల పత్రాలన్నింటినీ చింపివేసి, తన భర్తను గట్టిగా కౌగిలించుకుని కన్నీటి పర్యంతమైంది. నన్ను క్షమించమంటూ వేడుకుంది. అప్పటికే ఆమె మనస్తత్వాన్ని అర్ధం చేసుకున్న భర్త సౌరభ్ ఆమెను పూర్తిగా క్షమించేసి అక్కున చేర్చుకున్నాడు. నాకు కావాల్సింది కూడా ఇదే కదా అనుకుని.. నా వైపు కూడా తప్పు ఉంటే క్షమించాలంటూ కోరాడు. చివరికి, పాత మనస్పర్థలన్నింటినీ పక్కనపెట్టి కలిసి జీవించాలని వారు నిర్ణయించుకున్నారు. పరస్పరం ఓదార్పుల అనంతరం వారు తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో కోర్టు సైతం సరే అనాల్సి వచ్చింది.
ఇందుకు సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు భార్యభర్తల పంచాయతీలో ఆవేశాలతో నిర్ణయాలు, ప్రతికారాలు సరైనవి కావని, సౌరభ్ పెద్ద మనసు ముందు శిఖా ఆవేశం ఓడిపోయిందని, మాటలు అదుపులో పెట్టుకోవడమే భార్యభర్తల పంచాయతీలో సరైన నిర్ణయం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మనం ఇతరులతో మంచిగా వ్యవహరిస్తే, ఏదో ఒక రోజు నిజం, మంచితనం తప్పక వెలుగులోకి వస్తాయనడానికి ఈ సంఘటనే నిదర్శనం అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
हर महिला अगर अपनी जुबान पर थोड़ा ताला लगा ले तो मैं गारंटी के साथ कह सकता हूं कि दहेज और तलाक जैसी कभी नौबत ही ना आए
अब आज दिल्ली का ही मामला देख लीजिए शिखा सिंह की शादी 2020 में हुई थी, इन्होंने पति से स्वयं झगड़ा किया और खुद ही दहेज का केस डाल दिया, केस में पैसा लगाते-लगाते… pic.twitter.com/UFKp0hZbpu
— Ravi Yadav Sambhal (@RaviA2Y) June 11, 2026
