Lok Sabha | ఈ నెల 15 నుంచి 18వ లోక్‌సభ తొలి సమావేశాలు..!

Lok Sabha | సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 17వ లోక్‌సభ గడువు తీరిపోయింది. 18వ లోక్‌సభ కొలువుదీరబోతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న 18వ లోక్‌సభ సమావేశాలు తొలి సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీ దక్కడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.

  • Publish Date - June 8, 2024 / 10:37 AM IST

Lok Sabha : సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 17వ లోక్‌సభ గడువు తీరిపోయింది. 18వ లోక్‌సభ కొలువుదీరబోతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15న 18వ లోక్‌సభ సమావేశాలు తొలి సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీ దక్కడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. కూటమిలోని భాగస్వామ్య పార్టీల అధ్యక్షులంతా కలిసి శుక్రవారం మధ్యాహ్నం నరేంద్రమోదీని తమ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు.

ఈ మేరకు ఒక తీర్మానం చేసి నరేంద్రమోదీకి ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం మోదీ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. మోదీ ఇచ్చిన తీర్మాన ప్రతిని పరిశీలించిన ఆమె ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దాంతో రేపు సాయంత్రం ప్రధాన మంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఆ తర్వాత కేబినెట్‌ భేటీ అయ్యి పార్లమెంటు సమావేశాల ప్రారంభంపై నిర్ణయం తీసుకోనుంది.

లోక్‌సభలో ముందుగా ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్ తొలి రెండు రోజులు కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారాలు చేయిస్తారు. అనంతరం సభాపతిని ఎన్నుకుంటారు. స్పీకర్‌ ఎన్నిక తర్వాత రోజు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. దాంతో 18వ లోక్‌సభ సమావేశాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. ఈ నెల 15 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని విశ్వసనీయంగా తెలిసింది.

Latest News