వామ్మో ‘ఘోస్ట్ సైకిల్’…చూస్తే షాకింగ్ !
గుజరాత్ లోని సూరత్ వీధుల్లో 'ఘోస్ట్ సైకిల్' విన్యాసాలు చూసి జనం అవాక్కవుతున్నారు. ఏఐ సాయంతో మనిషి లేకుండా ప్రయాణిస్తున్న ఈ ఘోస్ట్ సైకిల్' టెక్నాలజీకి ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు.
విధాత : కీలు గుర్రం, పాతాళ భైరవీ సినిమాల కాలం నుంచి విఠలాచార్య సినిమాల క్రమంలో కూడా ఇప్పటికే రకరకాల మాయలు..వింతలతో కూడిన ఆవిష్కరణలు చూశాం. నిజ జీవితంలోనూ ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో అనేక రకాల వాహనాలు, వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. రోబోల రాకతో మరిన్ని అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి.
రోడ్డుపై డ్రైవర్ లేకుండా ప్రయాణించే వాహనాలు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకపోతున్నాయి. తాజాగా ఓ ఔత్సాహికుల ఆలోచనలతో మనుషులు తొక్కినట్లుగా సాగిపై ‘ఘోస్ట్ సైకిల్’ కూడా రోడ్లపైకి దూసుకపోతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
గుజరాత్ లోని సూరత్ వీధుల్లో ‘ఘోస్ట్ సైకిల్’ విన్యాసాలు చూసి జనం అవాక్కవుతున్నారు. శివమ్ మౌర్య అనే కుర్రాడు కేవలం రూ.35,000 ఖర్చుతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మెకానికల్ ఇంజనీరింగ్‌ను కలిపి వినూత్న సాంకేతికతను ఘోస్ట్ సైకిల్ తయారు చేశాడు. మనిషి లేకుండా.. ఎదో కనిపించని దెయ్యం తొక్కుతున్నట్లుగా నడిచే సైకిల్ రోడ్లపై దూసుకెళ్తుండగా..దానిని అంతా ‘ఘోస్ట్ సైకిల్’ అని పిలుస్తున్నారు.
ఏఐ సాయంతో మనిషి లేకుండా ప్రయాణిస్తున్న ఈ ఘోస్ట్ సైకిల్’ టెక్నాలజీకి ప్రతిఒక్కరూ ఫిదా అవుతున్నారు. మనిషి అధునాతన అద్భుత ఆలోచనలకు, ఆవిష్కరణలకు, సృజనాత్మకతకు ఇది ఓ నిదర్శనమంటూ అంతా ఘోస్ట్ సైకిల్ అవిష్కకరణ కర్త శివమ్ మౌర్యను అభినందిస్తున్నారు.
🚨 Driverless Cycle in India 😳 | AI Self-Balancing “Ghost Cycle” on Surat Roads Explained 🚨
A driverless bicycle riding on its own was spotted in Surat…
👉 no rider, no hands, no control — yet perfectly balanced 👀 pic.twitter.com/pQFK2NySXO— Instant Engineering (@Instant_engr) April 22, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram