దేశంలో టాప్ టెన్ ఆకర్షణీయమైన కంపెనీలలో గూగుల్‌ ఫస్ట్‌

రాండ్‌స్టడ్‌ ఎంప్లయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ విడుదల చేసిన భారత్‌లో అత్యంత ఆకర్షణీయమైన టాప్-10 కంపెనీల జాబితాలో గూగుల్ తొలి స్థానంలో నిలిచింది. టాటా గ్రూప్, అమెజాన్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి.

భారత్ లో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన టాప్‌ 10 కంపెనీల జాబితాను రాండ్‌స్టడ్‌ ఎంప్లయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ సంస్థ విడుదల చేసింది. జాబితాలో తొలిస్థానంలో గూగుల్‌ నిలిచింది. ఆ తర్వాతా స్థానాల్లో వరుసగా 2 టాటా గ్రూప్‌, 3. అమెజాన్‌, 4. శాంసంగ్‌ ఇండియా, 5. ఇన్ఫోనిస్‌, 6. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, 7. ఐటీసీ గ్రూప్‌, 8. హిందూస్థాన్‌ యూనిలీవర్‌, 9. మహీంద్ర&మహీంద్ర, 10. డెల్‌ టెక్నాలజీస్‌ కంపెనీలున్నాయి.

అయితే మార్కెట్ విలువ ప్రకారం టాప్ 1 స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంధనం, రిటైల్ & టెలికామ్ నిలువుగా, తర్వాతి స్థానాల్లో వరుసగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ టెలికమ్యూనికేషన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ బ్యాంకింగ్ & ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ & ఫైనాన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సమాచార సాంకేతికత (ఐటీ), బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆర్థిక సేవలు, లార్సెన్ & టూబ్రో లిమిటెడ్ మౌలిక సదుపాయాలు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ లు నిలిచాయి.

Latest News