Suicide | సహజీవనం చేయాలని వివాహిత వేధింపులు.. జిమ్ ట్రైనర్ ఆత్మహత్య
Suicide | ఆమె ఇద్దరు పిల్లలు. అయినా కూడా నాజుగ్గా, అందంగా కనిపించాలనే కోరిక ఆమెలో పుట్టింది. దాంతో ఓ జిమ్‌లో చేరింది. ఇక తనకు ప్రత్యేక శిక్షకుడిగా ఉన్న వ్యక్తికి శారీరకంగా దగ్గర కావాలన్న కోరిక రగలింది. ఇంకేముంది అతన్ని లొంగదీసుకుని శారీరకంగా దగ్గరైంది.
Suicide | ఆమె ఇద్దరు పిల్లలు. అయినా కూడా నాజుగ్గా, అందంగా కనిపించాలనే కోరిక ఆమెలో పుట్టింది. దాంతో ఓ జిమ్‌లో చేరింది. ఇక తనకు ప్రత్యేక శిక్షకుడిగా ఉన్న వ్యక్తికి శారీరకంగా దగ్గర కావాలన్న కోరిక రగలింది. ఇంకేముంది అతన్ని లొంగదీసుకుని శారీరకంగా దగ్గరైంది. చివరకు తనతో సహజీవనం చేయాలని వివాహిత వేధించడంతో.. సదరు జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు శివారులోని నెలమంగల సమీపంలోని వాజరహల్లికి చెందిన దిలీప్(28) స్థానికంగా ఓ జిమ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఈ జిమ్ సెంటర్‌లో 42 ఏళ్ల వివాహిత చేరింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే దిలీప్ ఆమెకు ప్రత్యేక శిక్షకుడిగా ఉన్నాడు. జిమ్‌లో ఆమెకు ట్రైన్ చేస్తున్న సమయంలో.. దిలీప్‌పై మనసు పారేసుకుంది. అతనికి దగ్గరవ్వాలనుకుంది.. అయ్యారు కూడా. ఇక ఆ తర్వాత దిలీప్‌ను బ్లాక్ మెయిల్ చేస్తూ.. డబ్బులను తీసుకునేది. ఆమె వేధింపులు భరించలేక దిలీప్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆమె భర్త సమక్షంలోనే సమస్యను పరిష్కరించారు. ఇంకా అంతా అయిపోయిందనుకుని దిలీప్ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ఆమె అతని ఊపిరి తీసింది.
తనకు శారీరకంగా దగ్గరైన నువ్వు.. తనతో సహజీవనం చేయాలని మళ్లీ ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడింది. లేదంటే డబ్బు ఇవ్వాలని, ఆస్తులు రాసివ్వాలని మళ్లీ బ్లాక్ మెయిల్ చేసింది. ఇక ఆమె వేధింపులు భరించలేని దిలీప్.. ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
శనివారం రాత్రి ఆమెకు దిలీప్ ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పాడు. అనంతరం తన గదిలోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. తెల్లారిన తర్వాత కూడా దిలీప్ తలుపు తీయకపోవడంతో బలవంతంగా డోర్ పగులగొట్టగా, సీలింగ్‌కు వేలాడుతున్న దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులు షాకయ్యారు.
దిలీప్ పేరెంట్స్ ఫిర్యాదు మేరకు నెలమంగళ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దిలీప్ గదిలో ఉన్న ఆధారాలను సేకరించారు. తన బిడ్డ ఆత్మహత్యకు కారణమైన వివాహితపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram