రాచనాగు ఎదురొస్తే… గుండె ఆగిపోయినట్లే!

అత్యంత విషపూరిత పాము కింగ్ కోబ్రా(గిరి నాగు..రాచనాగు) అతి దగ్గరగా ఎదురుపడితే మనుషులకు గుండె ఆగిపోయినంత పనవుతుంది. సరిగ్గా అలాంటి ఘటనే ఓ జనావాసంలో ఎదురైంది. ఓ భారీ రాచనాగు గ్రామంలోని ఓ ఇంట్లోకి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

విధాత : అత్యంత విషపూరిత పాము కింగ్ కోబ్రా(గిరి నాగు..రాచనాగు) అతి దగ్గరగా ఎదురుపడితే మనుషులకు గుండె ఆగిపోయినంత పనవుతుంది. సరిగ్గా అలాంటి ఘటనే ఓ జనావాసంలో ఎదురైంది. ఓ భారీ రాచనాగు గ్రామంలోని ఓ ఇంట్లోకి రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ పాము గాయపడి ఆగ్రహం..ఆందోళనతో ఉండటం గమనించారు. దెబ్బతిన్న పామును ఇబ్బంది పెట్టకుండా స్థానికులు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు.

స్నేక్ క్యాచర్‌ ఘటన స్థలానికి చేరుకుని కింగ్ కోబ్రాను ఎంతో జాగ్రత్తగా సురక్షితంగా పట్టుకున్నారు. స్థానికుల సహాయంతో రాచనాగు గాయాలకు పసుపు చల్లి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం ఆ రాచనాగును ఓ సంచిలో సురక్షితంగా బంధించారు. ఈ ప్రక్రియకు స్థానిక మహిళలు సహాయం చేయడం ఆసక్తికరం.

అరుదైన సరిసృప జాతిగా గుర్తించబడిన రాచనాగు మనుగడ ప్రస్తుతం భారత్ లోనే ఎక్కువగా కొనసాగుతుంది. పలు రాష్ట్రాలలో కింగ్ కోబ్రా పరిరక్షణ చర్యలు చేపడుతున్నారు. పర్యావరణ సమతుల్యత, జీవ వైవిద్య పరిరక్షణలో రాచనాగులు కీలకం అని..ఈ జాతిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైన ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 

Latest News