Rakesh Kishore : సీజేఐపై దాడి పట్ల పశ్చాత్తాపం లేదు
సీజేఐ గవాయ్‌పై దాడికి యత్నించిన న్యాయవాది రాకేష్ కిషోర్: "నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఆ పరమాత్ముడే నా చేత దాడి చేయించాడు." ఇతని లైసెన్స్‌ను బీసీఐ రద్దు చేసింది.

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు సీజేఐ గవాయ్‌పై దాడి చేసినందుకు నాకు ఎలాంటి బాధ, పశ్చాత్తాపం లేదు అని సీనియర్ న్యాయవాది రాకేష్ కిషోర్ స్పష్టం చేశారు. అయినా ఈ దాడి నేనేమీ చేయలేదు.. ఆ పరమాత్ముడే నా చేత దాడి చేయించాడు అని వ్యాఖ్యానించారు. నేను క్షమాపణ చెప్పను అని.. ఆ పరమాత్ముడు కోరితే మళ్లీ దాడి చేస్తానేమో అని రాకేష్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ గవాయ్ పై రాకేష్ కిషోర్ బూటు విసిరే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది, సహచర న్యాయవాదులు అడ్డుకుని బయటకు లాక్కెళ్లారు. సీజేఐపై దాడికి యత్నించిన రాకేష్ కిషోర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) తక్షణమే చర్యలు తీసుకుంది. అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. లెసెన్స్‌ను రద్దు చేసింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
విష్ణు దేవుడి విగ్రహంపై వ్యాఖ్యలే కారణమా?
మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఉన్న విష్ణు దేవుడి విగ్రహంపై దాఖలైన పి టిషన్ విషయంలో చేసిన వ్యాఖ్యలే జస్టిస్ గవాయ్‌పై దాడి యత్నానికి కారణం కావొచ్చని న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. ఖజురహోలోని జవెరీ టెంపుల్‌ను మళ్లీ నిర్మించి, ఏడు అడుగుల విష్ణు దేవుడి విగ్రహాన్ని నెలకొల్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను జస్టిస్ గవాయ్ తిరస్కరించారు. మీరు ఏం కోరుకుంటున్నారో వెళ్లి ఆ దేవుడినే అడగండంటూ పిటిషనర్ కు గవాయ్ సూచించారు. విష్ణు దేవుడికి మీరు నిజమైన భక్తులైతే అక్కడికే వెళ్లి ప్రార్థించండి.. కొంతసేపు ధ్యానం కూడా చేయండి అని పిటిషనర్ ను ఉద్దేశించి గవాయ్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.
సుప్రీంకోర్టు సీజేఐ గవాయ్‌పై దాడి చేసినందుకు ఎలాంటి బాధ, పశ్చాత్తాపం లేదు
అయినా ఈ దాడి నేనేమీ చేయలేదు.. ఆ పరమాత్ముడే నా చేత దాడి చేయించాడు
నేను క్షమాపణ చెప్పను.. ఆ పరమాత్ముడు కోరితే మళ్లీ దాడి చేస్తానేమో
– న్యాయవాది రాకేష్ కిషోర్
Courtesy: ANI#RakeshKishore… pic.twitter.com/YSOEC61s1T
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 7, 2025