ఇంట్లోకి చిరుత.. గర్జనతో భయపెడుతోంది!

నీలగిరిలో కుక్కను వెంటాడుతూ ఇంట్లోకి దూరిన చిరుత మంచం కింద దాక్కుంది. కుటుంబం గదిలో బంధించగా, అటవీశాఖ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.

అడవిలో ఉండాల్సిన చిరుత పులి ఇంట్లో దూరింది. ఈ అనూహ్య పరిణామంతో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు హడలిపోయారు. అయితే తెలివిగా దానిని గదిలో బంధించడం వైరల్ గా మారింది. తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం నీలగిరిలో ఓ చిరుత పులి అడవి నుంచి జనావాసాల్లోకి వచ్చింది. రాత్రి వేళ ఓ కుక్కను వెంటాడే క్రమంలో.అది నేరుగా ఓ ఇంట్లోకి దూరి, అక్కడి మంచం కింద నక్కింది.

చిరుతను గమనించిన ఇంటి యజమాని సమయస్ఫూర్తితో గది తలుపులు లాక్ చేశాడు. లోపల చిక్కుకుపోయిన చిరుత ఆక్రోశంతో గర్జిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అదృష్టవ శాత్తు చిరుత ఇంట్లోకి చొరబడిన సమయంలో మనుషులపై దాడి చేయకపోవడంతో ప్రాణనష్టం తప్పినట్లయ్యింది.

చిరుత పులి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు దానిని బంధించి అటవీ ప్రాంతానికి తరలించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.

Latest News