Mass Sick Leave | సిబ్బంది మూకుమ్మడి సిక్‌ లీవులు.. 90కి పైగా సర్వీసులను రద్దు చేసిన ఎయిరిండియా..!

Mass Sick Leave | సిబ్బంది మూకుమ్మడిగా సిక్‌ లీవులు పెట్టడంతో ఎయిర్ ఇండియా 90కి పైగా ఎక్స్ ప్రెస్ సర్వీసులను రద్దుచేసింది. చివరి క్షణంలో సిబ్బంది సిక్ అయ్యామంటూ మూకుమ్మడిగా లీవ్స్ తీసుకోవడంతో విమాన సర్వీసులను క్యాన్సిల్ చేయక తప్పలేదని ఎయిరిండియా తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు దాదాపు 90కి పైగా విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని వెల్లడించింది.

Mass Sick Leave | సిబ్బంది మూకుమ్మడి సిక్‌ లీవులు.. 90కి పైగా సర్వీసులను రద్దు చేసిన ఎయిరిండియా..!

Mass Sick Leave : సిబ్బంది మూకుమ్మడిగా సిక్‌ లీవులు పెట్టడంతో ఎయిర్ ఇండియా 90కి పైగా ఎక్స్ ప్రెస్ సర్వీసులను రద్దుచేసింది. చివరి క్షణంలో సిబ్బంది సిక్ అయ్యామంటూ మూకుమ్మడిగా లీవ్స్ తీసుకోవడంతో విమాన సర్వీసులను క్యాన్సిల్ చేయక తప్పలేదని ఎయిరిండియా తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు దాదాపు 90కి పైగా విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని వెల్లడించింది.

అయితే విమానాల రద్దు కారణంగా అప్పటికే ఎయిర్‌పోర్టులకు చేరుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరైతే తాము ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాగా ఉద్యోగులంతా చివరి క్షణంలో విధులకు హాజరుకాకపోవడంతో సర్వీసులను నిలిపివేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదని, సెలవు పెట్టిన ఉద్యోగులను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదని తెలిపింది.

కాగా, సిబ్బంది మూకుమ్మడి సెలవుల వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకునేందుకు ఏవియేషన్ అథారిటీ విచారణ చేస్తున్నదని ఎయిర్ ఇండియా వెల్లడించింది. చివరి నిమిషంలో ఉద్యోగులంతా అస్వస్థతకు గురయ్యామని పేర్కొంటూ లీవ్ తీసుకున్నారని తెలిపింది. విమానాల రద్దు కారణంగా ఇబ్బంది పడిన ప్రయాణికులకు వారి టికెట్ ధరను పూర్తిగా తిరిగి చెల్లించడమో లేదంటే వారు కోరితే మరో తేదీకి ప్రయాణాన్ని రీ షెడ్యూల్ చేయడమో చేస్తామని ప్రకటించింది.

కాగా ఎయిర్ ఇండియా ఇటీవలే టాటా సంస్థ చేతుల్లోకి వెళ్లింది. కానీ ఉద్యోగులకు యాజమాన్యానికి మధ్య వివిధ అంశాలపై వివాదం నడుస్తోంది. లేఓవర్స్‌ సమయంలో రూమ్ షేరింగ్‌ చేసుకోవాలని యాజమాన్యం చెప్పగా.. ఆ నిర్ణయంపై క్యాబిన్ సిబ్బంది ఆందోళన లేవనెత్తారు. దానితోపాటు ఇతర సమస్యలను కూడా వివరిస్తూ AIXEU కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాయగా నెల రోజుల తర్వాత యాజమాన్యానికి షోకాజ్‌ నోటీస్‌ వచ్చింది.