రామాయణంలో బంగారు జింక ఘట్టాన్ని విన్నాం. అయితే ప్రకృతిలో బంగారు వర్ణం జింక లేదని..ఇదేదో రాక్షస మాయగా అనిపిస్తుందని రామలక్ష్మణులు చెప్పినా..సీతమ్మ బంగారు జింకను చూసి ఆకర్షితులై ఆ జింకను తెచ్చివ్వాలంటూ రాముడిని కోరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రామాయణ కథ అందరికి విదితమే. అయితే సరిగ్గా ఇప్పుడు అస్సాం అడువుల్లో అలాంటి అరుదైన వింతనే చోటుచేసుకుంది. ఎప్పటిలాగే బంగారు జింక కాకపోయినా..ఓ తెల్లటి శ్వేత వర్ణపు జింక కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. స్వయంగా తెల్ల జింక వీడియోను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ పోస్టు చేయడం విశేషం.
అస్సాంలో అరుదైన వన్యప్రాణులకు ఆలవాలమైన కజిరంగ అభయారణ్యంలో ఒక ఆల్బినో హాగ్ డీర్ (తెల్లటి జింక) కనిపించింది. కజిరంగా జాతీయ పార్కులోని పొడవైన గడ్డి, పొదల మధ్య నిటారైన కొమ్ములతో కూడిన అరుదైన తెల్ల జింక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యంలో తెల్లరంగు జింకలు కూడా ఉంటాయా అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
శ్వేత వర్ణపు అరుదైన జింక మన వన్యప్రాణి సంపదకు ఒక ప్రతీకగా నిలుస్తుందని, అస్సాం అడవులలో అత్యంత అరుదైన జాతులు సైతం వృద్ధి చెందేలా చూడాలన్న, వాటిని సంరక్షించాలన్న మన సంకల్పాన్ని ఇది స్పష్టంగా చాటిచెబుతుందని తన పోస్టులో సీఎం హిమంత శర్మ అభిప్రాయపడ్డారు. అస్సాం అడవులలో అత్యంత అరుదైన జాతులు కూడా వృద్ధి చెందేలా సంరక్షించాలనే మా సంకల్పాన్ని ఇది నొక్కి చెబుతోందన్నారు.
భారతీయ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కజిరంగాలో, ఇటీవల కెమెరా ట్రాప్‌లు, సందర్శకుల ఫోటోల ద్వారా అనేక ల్యూసిస్టిక్ లేదా ఆల్బినో అడవి జింకల జాడలు నమోదైనట్లుగా అక్కడి ఫారెస్టు అధికారులు వెల్లడించారు. మొత్తం మీద దేశంలోని అడవుల్లో ప్రస్తుతం ఉన్న జింకల జాతులకు భిన్నంగా కొత్తగా అరుదైన తెల్ల జింక ఉనికి వెలుగుచూడటం ఆసక్తికరంగా మారింది. తెల్ల జింక ఉనికితో ఇప్పుడు కజిరంగా నేషనల్ పార్క్ కు సందర్శకుల తాకిడి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది.
Not every day does one witness something this rare 🦌
The sighting of an albino hog deer in @kaziranga_ stands as a symbol of the richness of our wildlife. It highlights our resolve to conserve and ensure that even the rarest species continue to thrive in the forests of Assam. pic.twitter.com/8jUDk1yScb
— Himanta Biswa Sarma (@himantabiswa) May 26, 2026
ఇవి కూడా చదవండి :
ఆ ముగ్గురి ఐపీఎస్ లను సస్పెండ్ చేసిన సీఎం విజయ్
Knife sharpeners | హైదరాబాద్‌లో కత్తులకు పదును.. రోజుకు రూ. 2 వేల సంపాదన..!
