అంత్యక్రియలతో ఏనుగుకు కన్నీటి వీడ్కోలు

కజిరంగలో మోహన్ మాల ఏనుగు వృద్ధాప్యంతో మృతి. సిబ్బంది కన్నీటి వీడ్కోలు, ఘన అంత్యక్రియలు, ఏనుగు-మనుషుల అనుబంధానికి నిదర్శనం.

అంత్యక్రియలతో ఏనుగుకు కన్నీటి వీడ్కోలు

విధాత : వన్యప్రాణులతో ముఖ్యంగా ఏనుగులకు, మనుషులకు ఒకసారి అనుబంధం ఏర్పడితే వారి బంధం చిరస్మరణియంగా నిలుస్తుందంటారు. ఇందుకు కజిరంగా అభయారణ్యంలో జరిగిన ఏనుగు మరణం ఓ నిదర్శనంగా నిలిచింది. కజిరంగ అభయారణ్యంలో నివసించే మోహన్ మాల అనే ఏనుగు వద్దాప్యంతో మరణించింది. 1970 నుండి కజిరంగా కుటుంబంలో భాగమైన ఈ ఆడ ఏనుగుతో అక్కడి అధికారులు, సిబ్బందితో మంచి బంధం ఏర్పడింది. సహజంగా మిగతా ఏనుగులకు భిన్నంగా ఎక్కువగా మనుషులతో కలిసిపోయే ఈ ఏనుగు వరదల సమయంలో సహాయక చర్యలలో కీలక వ్యవహరించేదట.

వృద్ధాప్యంతో మరణించిన మోహన్ మాల ఏనుగుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటు దానిని మరిచిపోలేక అభయారణ్య సిబ్బంది..అధికారులు దానికి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికేందుకు నిర్ణయించుకున్నారు. అధికారిక లాంఛనాలతో పాటు దానికి ఇష్టమైన ఆహార పదార్ధాలను ఏనుగు భౌతిక కాయం వద్ద పెట్టి శాస్త్రయుక్తంగా పూజాధిక తంతులు నిర్వహించి అనంతరం దానిని ఖననం చేశారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ అభయారణ్యంలో గత ఏడాది మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ ఏనుగు ఎక్కి సవారీ చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి…

ఇక మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్​? – బిసిసిఐ మదిలో గిల్​!

తిరునామాలతో జన్మించిన ఆవు దూడ..శ్రీవారి మహిమగా వైరల్