ఆ రెండు బ్యాంకులపై ఆర్‌బీఐ కొరడా..! భారీగా జరిమానా..!

విధాత: రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందుకు ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝుళిపించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రూ.3.95 కోట్లు జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మంగళవారం వెల్లడించింది.
రుణాలు అడ్వాన్సులు-చట్టబద్ధమైన ఇతర నిబంధనలు, మోసాల వర్గీకరణ, కమర్షియల్ బ్యాంకుల రిపోర్టింగ్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నిబంధనలు పాటించనందుకు ఐసీఐసీఐ బ్యాంకు జరిమానా విధించినట్లు పేర్కొంది. బ్యాంకులో డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరు వేరే కంపెనీల్లోనూ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఆ ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలకు ఐసీఐసీఐ బ్యాంకులు రుణాలు మంజూరు చేసింది.
అయితే, ఇది బ్యాంకింగ్ నిబంధనలకు వ్యతిరేకం. అలాగే నాన్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్‌ను సేలింగ్, మార్కెటింగ్ చేయడం వంటి మోసాలకు ఐసీఐసీఐ బ్యాంక్ పాల్పడినట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ఇక కొటక్ మహీంద్రా బ్యాంకుకు రిస్క్ మేనేజ్‌మెంట్, ఆఫ్ కండక్ట్‌లకు సంబంధించి ఆర్బీఐ విధించిన నిబంధనలను కొటక్ మహీంద్రా ఉల్లంఘించింది.
బ్యాంకులు రికవరీ ఏజెంట్లను నియమించుకోవడానికి సంబంధించిన నిబంధనలను, రుణాల జారీకి సంబంధించిన రెగ్యులేటరి నిబంధనలు సైతం ఉల్లంఘించగా.. రుణం తీసుకున్న వ్యక్తి నుంచి లోన్ ఇచ్చేందుకు అంగీకరించిన తేదీ నుంచి వడ్డీ వసూలు చేసింది. వాస్తవానికి లోన్ తీసుకున్న వ్యక్తి ఖాతాల్లో డబ్బులు జమైన నాటి నుంచి వడ్డీని లెక్కించాల్సి ఉంటుంది. అలాగే, ప్రి క్లోజర్ నిబంధనలకు విరుద్ధంగా రుసు వసూలు చేయడంతో ఆర్‌బీఐ జరిమానా విధించింది.