Snake Bite | అర్ధరాత్రి వేళ అక్కాచెల్లెళ్లకు పాముకాటు.. తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో మృతి
Snake Bite | అర్ధరాత్రి వేళ పాము కాటు( Snake Bite )కు గురైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు( Sister ) ప్రాణాలు విడిచారు. అది కూడా తల్లిదండ్రుల( Parents ) నిర్లక్ష్యంతోనే. సకాలంలో ఆస్పత్రికి( Hospital ) తీసుకెళ్లి ఉంటే.. ఆ చిన్నారుల ప్రాణాలు నిలిచేవి.
Snake Bite | భువనేశ్వర్ : గాఢ నిద్రలో ఉన్న ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లను( Sisters ) పాము కాటేసింది. పాము కాటు( Snake Bite )ను తట్టుకోలేని ఆ ఇద్దరు చిన్నారులు గట్టిగా ఏడ్చేశారు. దాంతో తల్లిదండ్రులు( Parents ) ఆ పిల్లలను ఆస్పత్రికి( Hospital ) తీసుకెళ్లకుండా, ఓ మాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లారు. చివరకు ఆ చిన్నారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ఒడిశా( Odisha )లోని నబరంగ్‌పూర్ జిల్లా ( Nabarangpur district )లో మంగళవారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నబరంగ్‌పూర్ జిల్లా పరిధిలోని రాజ్‌పూర్ గ్రామానికి చెందిన కృషా హరిజన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రితూరాజ్ హరిజన్(9 నెలలు), ఆమె సోదరి అమిత హరిజన్(11) సోమవారం రాత్రి గాఢ నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను విషపూరితమైన పాము కాటేసింది. దీంతో వారు గట్టిగా ఏడ్చారు.
అప్రమత్తమైన తల్లిదండ్రులు.. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా స్థానికంగా ఉన్న ఓ మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారు. విషం కక్కిస్తానని చెప్పి ఆ మాంత్రికుడు మూడు గంటల పాటు సమయం వృథా చేశాడు. ఆ చిన్నారులు స్పృహాలోకి నుంచి బయటకు రాలేదు. వారి పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో.. చివరకు తెల్లవారుజామున 4 గంటలకు నబరంగ్‌పూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పిల్లలు ఇద్దరూ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ సందర్భంగా జిల్లా మెడికల్ ఆఫీసర్ సంతోష్ కుమార్ పాండా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏడాదికి 3 వేల మంది పాము కాటుకు గురవుతున్నట్లు తెలిపారు. ఇందులో 40 శాతం మంది మాంత్రికుల వద్దకు తీసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అదే ఆస్పత్రికి నేరుగా తీసుకువస్తే యాంటీ వీనమ్ ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందన్నారు. ఈ మూఢనమ్మకాలను పారద్రోలడానికి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని, అయినా కూడా ప్రజలు వాటినే నమ్ముతున్నారని పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram