SpiceJet Plane Loses Wheel During Take-Off | టెకాఫ్ లో ఊడిపడిన విమానం చక్రం..తప్పిన ప్రమాదం
టేకాఫ్ సమయంలో స్పైస్ జెట్ విమానం చక్రం ఊడిపడగా ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ విజయవంతం.. ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
విధాత : గుజరాత్ కండ్లా నుంచి ముంబైకి 75మంది ప్రయాణికులతో బయలుదేరిన క్యూ 400స్పైస్ జెట్(Q400 SpiceJet) విమానానికి శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ కాగానే రన్ వేపై విమానం చక్రాల్లో ఒకటి ఊడిపడింది. విమానం నుంచి ఏదో వస్తువు పడినట్లు గుర్తించిన ఎయిర్‌పోర్టు టవర్ కంట్రోల్ అధికారులు.. రన్‌వేపైకి తనిఖీ బృందాలను పంపించారు. పడిపోయిన వస్తువు విమానం చక్రంగా గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ముంబయి విమానాశ్రయ(Mumbai Airport) అధికారులకు సమాచారం అందించారు. ఆ స్పైస్ జెట్ కుడివైపు ఉన్న రెండు చక్రాల్లో ఒకటి ఊడిపోయినట్లు తెలిపారు.
ఈ సమాచారంతో అప్రమత్తమైన పైలట్లు ఎమర్జన్సీ ప్రకటించి ముంబై విమానాశ్రయంలో విమనాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. క్షేమంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, సిబ్బంది అంతా కూడా హమ్మాయ్యా.. బతికిపోయాం అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. స్పైస్ జెట్ విమానం టేకాఫ్ సమయంలో ఊడిపోయిన చక్రం(SpiceJet Plane Loses Wheel During Take-Off )..అలాగే ఎమర్జన్సీ ల్యాండింగ్ రెండు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram