Bengaluru Techie Couple Suicide : బెంగళూర్ లో టెకీ జంట ఆత్మహత్య
బెంగళూరులో టెకీ జంట ఆత్మహత్య కలకలం. సిద్దిపేటకు చెందిన యువకుడు ఉరి వేసుకోగా, అతనితో సహజీవనం చేసిన యువతి భవనం నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది.
విధాత : బెంగుళూర్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జంట ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బాబు రెడ్డి కుంట(32) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. సోమవారం కొత్తనూరులోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడితో సహజీవనం చేస్తున్న యువతి(31) ఈ విషయాన్ని తట్టుకోలేక తను కూడా అపార్ట్‌మెంట్‌లోని 17వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
తన మృతికి ఎవరూ కారణం కాదంటూ.. బాబు రాసిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర మానసిక ఒత్తిడి వల్లే బాబు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు. వీరి సహజీవనం గురించి వారి కుటుంబాలకు తెలియదన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
విప్ప చెట్ల పెంపకానికి సీఎం రేవంత్ కు లేఖ రాశా: అనిరుధ్ రెడ్డి
Job Mela | నేడు ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram