విధాత : జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు అధికారులు శనివారం ప్రకటించారు. యాత్రికులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపి వేసినట్టు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రికుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు. అమర్‌నాథ్ ఆలయ గుహ, శేషనాగ్ శిఖరం వద్ద ఉష్ణోగ్రత గరిష్ఠంగా 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపో వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. 3,800 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని సందర్శించి, సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకున్న భక్తుల సంఖ్య 1.50 లక్షలు దాటింది. అనంతనాగ్‌లోని సున్వాన్-వహల్దామ్ మార్గం, గందర్బాల్లో బల్తాల్ మార్గాల గుండా జూన్ 29న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర.. ఆగస్టు 19న ముగుస్తుంది. గత ఏడాది 4.5 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ లోని మంచు లింగాన్ని దర్శించుకుని ప్రార్థనలు చేశారు.
అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ … వర్షాల నేపథ్యంలో నిర్ణయం
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు అధికారులు శనివారం ప్రకటించారు. యాత్రికులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు