విధాత : చూస్తేనే మనుషులు భయంతో వణికిపోయే భారీ కింగ్ కోబ్రాలు రెండు.. జనావాసాల్లో హల్చల్ చేయడం కలకలం రేపింది. ఒరిస్సా గంజాం జిల్లా చికిటి ప్రాంతాల్లో 15 అడుగుల భారీ కింగ్ కోబ్రాలు రెండు గ్రామస్తులను వణికించాయి. వాటిని చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోయి స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్లు వెంటనే చేరుకుని చాకచక్యంగా కింగ్ కోబ్రాలను పట్టుకుని, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
స్నేక్ క్యాచర్స్ సుమారు గంటపాటు శ్రమించి ఆ భారీ కింగ్ కోబ్రాలను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం వాటిని రెండు సంచులలో ఉంచి, సమీపంలోని అటవీ ప్రాంతానికి తరలించి, వాటి సహజ సిద్ధమైన ఆవాసంలోకి విడిచిపెట్టారు. ఎవరికీ ఎలాంటి హాని కలగకుండా ఆ కింగ్ కోబ్రాలను పట్టుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సమయానికి స్పందించి సాహసోపేతంగా వ్యవహరించిన స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యులను, అటవీ శాఖ అధికారులను స్థానికులు అభినందించారు.
ఇవి కూడా చదవండి :
ట్రంప్ ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ క్యాంపెయిన్ !
Anchor Suma | కారులో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సుమ.. నవ్వు వెనుక ఉన్న కష్టం బయటపెట్టిన స్టార్ యాంకర్
