Anchor Suma | కారులో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సుమ.. నవ్వు వెనుక ఉన్న కష్టం బయటపెట్టిన స్టార్ యాంకర్
Anchor Suma | తెలుగు టెలివిజన్ ప్రపంచంలో చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకునే స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి షో అయినా తన ఎనర్జీ, టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే సుమ, తన కెరీర్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్టు తాజాగా వెల్లడించారు.
Anchor Suma | తెలుగు టెలివిజన్ ప్రపంచంలో చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకునే స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి షో అయినా తన ఎనర్జీ, టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే సుమ, తన కెరీర్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్టు తాజాగా వెల్లడించారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సుమ, తన జీవితంలో జరిగిన ఓ భావోద్వేగ సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఒకరోజు వరుసగా షూటింగ్స్ ఉండటంతో పూర్తిగా అలసిపోయి, శరీరం సహకరించని స్థితికి చేరుకున్నానని తెలిపారు. అయినప్పటికీ బయటకు మాత్రం ఎప్పటిలాగే నవ్వుతూ తన పనిని పూర్తి చేశానని చెప్పారు.
నా అలసట ఎవరికి తెలియదు..
“అంతగా అలసిపోయినా ఎవరికీ తెలియకుండా షూటింగ్ పూర్తి చేశాను. కానీ ఆ తర్వాత కారులో కూర్చొని బోరున ఏడ్చేశాను” అంటూ సుమ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకుల ముందే ఎప్పుడూ హ్యాపీగా కనిపించే ఆమె కూడా ఇలాంటి క్షణాలను ఎదుర్కొంటారనే విషయం అభిమానులను కదిలిస్తోంది.
అయితే ఇదే సమయంలో తన ప్రత్యేకత గురించి కూడా సుమ వివరించారు. ఎంత అలసిపోయినా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే చాలు మళ్లీ పూర్తిగా రీఛార్జ్ అయిపోతానని చెప్పారు. “ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నా సరే, మళ్లీ కొత్త ఎనర్జీతో షూటింగ్‌కు వెళ్లగలను. అది నాకు వచ్చిన ఒక వరం లాంటిది” అని తెలిపారు.
నవ్వు వెనుక ఎన్నో కష్టాలు..
సుమ ఇంటర్వ్యూకు స్పందించిన నెటిజన్లు, ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. “స్క్రీన్‌పై కనిపించే నవ్వు వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. యాంకర్స్, నటులు కూడా మనలాగే భావోద్వేగాలు కలిగిన మనుషులే” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రేక్షకులను ఎప్పుడూ నవ్వించే సుమ వంటి సెలబ్రిటీలు కూడా ఒత్తిడి, అలసటను ఎదుర్కొంటారని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. అయినప్పటికీ తమ వృత్తిపట్ల అంకితభావంతో ముందుకు సాగుతున్న వారి కృషిని అభిమానులు మరింతగా అభినందిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram