మినీ టైటానిక్ విషాదం..ఆ బోటు ప్రమాదం
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ జిల్లా నర్మదా నదిపై ఉన్న బర్గీ జలాశయంలో బోటు ప్రమాదం టైటానిక్ నౌక మునిగిపోయిన ఘటనతో కూడిన పోలికలతో మినీ టైటానిక్ ప్రమాదంగా నిలిచిపోయింది.
విధాత : ప్రపంచంలో అట్లాంటిక్ సముద్రంలో మంచుకొండను ఢీకొని మునిగిపోయిన టైటానిక్ నౌక విషాదంతా ఘటన అందరికి తెలిసిందే. టైటానిక్ మునిగిపోయిన ఘటనను ప్రఖ్యాత హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ సినిమాగా తీస్తే..ఆనాటి ఆ విషాద ఘటన కళ్లముందు కనిపించి ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించింది. టైటానిక్ నౌక మునిగిపోయే ముందు అందులోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకునేందుకు లైఫ్ బోట్లు,లైఫ్ జాకెట్లతో చేసిన ప్రయత్నాలు..చనిపోతామని తెలిసిపోయిన క్రమంలో వారి భావోద్వేగాలు అందరిని కలిచివేశాయి.
సరిగ్గా…మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ జిల్లా నర్మదా నదిపై ఉన్న బర్గీ జలాశయంలో బోటు ప్రమాదం కూడా ఆనాటి టైటానిక్ ఘటనతో కూడిన పోలికలతో మినీ టైటానిక్ ప్రమాదంగా నిలిచిపోయింది.
బోటులోకి నీరు వస్తుండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన దృశ్యాలు, పడవలో భారీ కుదుపులు వచ్చిన సమయంలో సిబ్బంది లైఫ్ జాకెట్లు ఇవ్వడానికి మూటలు విప్పుతున్న దృశ్యాల వీడియోలు, బోటులో లైఫ్ జాకెట్ తో కనిపించిన మహిళ మరీనా(39).. తన కుమారుడు త్రిషాన్(4)ను పొదివిపటుకున్న దృశ్యం…ఆ తర్వాతా ప్రమాదంలో వారిద్దరు అదే తీరులో చనిపోయిన విషాదంతం అన్ని హృదయ విదారకంగా కనిపించాయి.
తాజాగా వెల్లడైన మరో వీడియోలో బోటు మునిగిపోయాక పైన డెక్ భాగంలో కొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండటం, మరికొందరు నీళ్లలో ప్రాణాలో తేలుతూ కనిపిస్తున్న దృశ్యాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టాయి.
ఇంకొందరు సహాయం బృందాలను చేరుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ప్రమాదం సందర్బంగా నెలకొన్న భయానక, విషాద దృశ్యాలు వీడియోలో వెల్లడయ్యాయి. నీటిలో మునిగిపోతూ..కాపాడాలంటూ పర్యాటకులు హాహాకారాలు చేస్తున్న వీడియో అందరిని కలిచివేస్తుంది. ఈ ప్రమాదంలో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని ప్రమాదం నుంచి బయటపడిన వారు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరింది.
कितना दर्दनाक मंजर है – लेटेस्ट वीडियो
कुछ लोग क्रूज के साथ ही डूब गए कुछ लोग बह गए
और कुछ लोग अपनी जान बचाने के संघर्ष कर रहे हैं
जबलपुर क्रूज हादसा pic.twitter.com/atHygNFITL
— Jitendra Verma (@jeetusp) May 3, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram