Viral Video | జాతివైరం మరిచి.. చెలిమి..! సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో..

Viral Video | ఎందుకో తెలియదు గానీ.. పిల్లి, కుక్కల మధ్య జాతివైరం కొనసాగుతూ వస్తుంది. పిల్లిని ఎప్పుడు చూసినా కుక్కలు తరుముతుండడం చూసే ఉంటాం. కానీ, కొన్ని సందర్భాల్లో జాతి వైరం మరిచి ఎంతో స్నేహంగా ఉండడం చాలా అరుదుగా కనిపిస్తాయి. తాజాగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్లి, కుక్క, కోతి జాతి వైరాన్ని మరిచి ఎంతో స్నేహంగా ఉండడం చూపరులను ఆకట్టుకుంటున్నది.

  • Publish Date - May 14, 2024 / 11:00 AM IST

Viral Video | ఎందుకో తెలియదు గానీ.. పిల్లి, కుక్కల మధ్య జాతివైరం కొనసాగుతూ వస్తుంది. పిల్లిని ఎప్పుడు చూసినా కుక్కలు తరుముతుండడం చూసే ఉంటాం. కానీ, కొన్ని సందర్భాల్లో జాతి వైరం మరిచి ఎంతో స్నేహంగా ఉండడం చాలా అరుదుగా కనిపిస్తాయి. తాజాగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్లి, కుక్క, కోతి జాతి వైరాన్ని మరిచి ఎంతో స్నేహంగా ఉండడం చూపరులను ఆకట్టుకుంటున్నది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న 43 సెకన్ల వీడియో నెటిజన్లను ఫిదా చేస్తున్నది.

కుక్క, పిల్లి, కోతి స్నేహంగా మెలగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. వీడియో ప్రకారం.. కుక్క, పిల్లి, కోతి మూడు పక్కపక్కన కూర్చున్నాయి. కుక్క ముందటి కాళ్ల మధ్యన పిల్లి ముడుచుకొని కూర్చోగా ఆ రెండింటినీ ఆనుకొని కోతి కూర్చున్నది. అలసిపోయినట్లుగా ఉన్న కుక్క, పిల్లి కునుకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక కోతి.. కుక్క నోట్లో వేలు పెట్టి దాన్ని చికాకు పెడుతూనే ముద్దాడింది. తర్వాత తల గోక్కొని పేలను నోట్లో వేసుకోవడం వీడియోలో కనిపించింది.

యోధా4ఎవర్‌ అనే యూజర్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా.. వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 2.2 మిలియన్ల మందికిపైగా వీక్షించారు. 58వేల వరకు లైక్స్‌ వచ్చాయి. 6వేల మందికిపైగా రీట్వీట్‌ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. భౌతిక తేడాలను అధిగమించి.. మూడు జంతువుల మనసులు కలిశాయంటూ ఓ యూజర్ కామెంట్‌ చేయగా.. ఇదో హ్యాపీ ఫ్యామిలీ అంటూ మరొకరు స్పందించారు. సమాజంలో అందరూ కులమతాలకు అతీతంగా శాంతియుతంగా జీవించాలనే సందేశాన్ని ఈ వీడియో చెబుతుందని మరో నెటిజన్‌ పేర్కొన్నారు.

Latest News