Amrapali Ias : ఆమ్రపాలి తెలంగాణకే..!

Amrapali Kata | క్యాట్​ ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి ఆమ్రపాలికి ఉపశమనం కలిగింది. ఆమెను తెలంగాణకే తిరిగి కేటాయిస్తూ క్యాట్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

Amrapali Ias : ఆమ్రపాలి తెలంగాణకే..!

Amrapali Kata | ఐఏఎస్‌ అధికారి ఆమ్రపాలికి క్యాట్‌లో ఊరట కలిగింది. ఆమెను తిరిగి తెలంగాణకే కేటాయిస్తూ క్యాట్‌ ఉత్తర్వులు జారీ చేసింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం (డీఓపీటీ-DOPT) ఆదేశాలతో గతేడాది అక్టోబర్‌లో ఆమె ఆంధ్రప్రదేశ్​ క్యాడర్​కు బదిలీ అయ్యారు.   తనను తెలంగాణకే కేటాయించాలని డిఓపీటీ ఆదేశాలను సవాల్​ చేస్తూ క్యాట్‌(CAT)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమ్రపాలి పిటిషన్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ అనుమతి ఇస్తూ తిరిగి తెలంగాణ(Telangana)కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో పని చేస్తున్న పలు ఐఏఎస్‌ అధికారుల్లో వాణీ ప్రసాద్‌, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతితో పాటు ఐపీఎస్‌ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతిలను కేంద్రం ఏపీ(Andhra Pradesh) క్యాడర్​కు కేటాయించింది. తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌ అధికారులను ఏపీ నుండి తిరిగి తెలంగాణకు వెళ్లాలని డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది.

డీవోపీటీ ఆదేశాలతో ఆయా అధికారులు తెలంగాణ, ఏపీలో రిపోర్ట్‌ చేశారు. ఆ తర్వాత వారికి రెండు ప్రభుత్వాలు పలు శాఖల బాధ్యతలు అప్పగించింది. అయితే, తనను తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌(Central Administrative Tribunal)ను ఆమ్రపాలి ఆశ్రయించారు. తెలంగాణలో కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. ఆమ్రపాలి(Amrapali Kata) పిటిషన్‌ను అనుమతించిన క్యాట్‌.. తాజాగా తెలంగాణకే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.