ప్రఖ్యాత రామమందిరం అయోధ్య బాల రాముడికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నైవేద్యం సమర్పించడం వైరల్ గా మారింది. ఆ నైవేద్యం సాంప్రదాయ భారతీయ నైవేద్యాల తరహాలో కాకుండా మామిడి పండ్ల రూపంలో అందడం విశేషం. ప్రపంచంలోనే ఖరీదైన జపాన్‌కు చెందిన మియాజాకీ మామిడి పండ్లను రైతు ఓం ప్రకాశ్ సింగ్ రామయ్యకు నైవేద్యంగా పెట్టాడు.
ఈ ప్రత్యేకమైన మామిడి పండ్లు కిలో రూ.2.5 నుంచి రూ.3 లక్షల వరకు ఉంటాయి. ‘ఎగ్ ఆఫ్ ది సన్’ గా పిలిచే ‘మియాజాకీ’ రకం మామిడి పండ్లలో ఒక్కో పండు ధర దాదాపు రూ.లక్షకు పైమాటే. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన ఓం ప్రకాశ్ సింగ్ అనే రైతు తన పొలంలో వీటిని పండించారు. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా తొలి పంటను తులసి ఆకుల్లో పెట్టి ఆయోధ్య బాల రాముడికి నైవేద్యంగా సమర్పించి తన భక్తి ప్రపత్తులను చాటుకున్నాడు.
తొలి పండును రామయ్యకు..
అయోధ్య వాతావరణ పరిస్థితులకు మియజాకి రకం మామిడి చెట్టు ఎంతవరకు అనుకూలంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంలో రెండేళ్ల క్రితం రైతు ఓంప్రకాష్ సింగ్ ఈ రకం మొక్కనుని నాటారు. ఆ చెట్టు స్థానిక వాతావరణానికి విజయవంతంగా అలవాటు పడి, ఈ సీజన్‌లో దాదాపు డజను పండ్లను కాసింది. ఒక్కోటి 150 గ్రాముల నుండి 300 గ్రాముల బరువు ఉంటుంది. సంప్రదాయం ప్రకారం పండిన మొదటి మామిడి పండును దేవుడికి సమర్పించానని, మియాజాకితో పాటు, థాయిలాండ్ రకం ‘బనానా మ్యాంగో’, ఆస్ట్రేలియా రకం ‘R2E2’, అలాగే భారతీయ రకాలైన ‘చౌసా’, ‘దశేరి’ వంటి అనేక ఇతర రకాలను కూడా నేను పెంచుతున్నాను” అని ప్రకాశ్ సింగ్ చెప్పారు.
ఓంప్రకాష్ సింగ్ తోటను సందర్శించిన మహంత్ సీతారామ్ దాస్ జీ మహారాజ్ మొదటి పంటను దైవానికి సమర్పించే సంప్రదాయాన్ని ప్రస్తావించారు. దీంతో రైతు ప్రకాశ్ సింగ్ అత్యంత ఖరీదైన మామిడి పండును మొదట దైవానికి సమర్పించారని, నిజంగా ఇది గొప్ప కార్యం అని మహంత్ సీతారాం దాస్ జీ మహారాజ్ చెప్పుకొచ్చారు.
దేశంలో విస్తరిస్తున్న మియాజాకీ మామిడి పండ్ల సాగు
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రైతు సంకల్ప్ విహార్ అనే రైతు, కర్ణాటకలోని ఉడిపికి చెందిన జోసెఫ్ లోబో, చత్తీస్ ఘడ్ బస్తర్ లోర్ ‘ట్రీ మ్యాన్’ సంపత్ ఝా, ఆదిలాబాద్ జిల్లా ఎచ్చోడ మండలం ముఖ్రా (కె) గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గడ్గే మీనాక్షి, అనకాపల్లి జిల్లా చోడవరం సమీపంలోని నరసయ్యపేటలో పరిటాల నాగేశ్వరరావు, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో పుట్టిగుంట సతీష్‌కుమార్, ఖమ్మం జిల్లా బారిగూడెంలో రైతు గరికపాటి వెంకట్రావు , నిర్మల్ జిల్లాకు చెందిన డాక్టర్ రాపల్లి సత్యంమియాజాకీ వేసి మంచి దిగుబడిని సాధిస్తున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోసీ గ్రామానికి చెందిన సుమన్‌బాయి గైక్వాడ్ అనే మహిళా రైతు పండించారు.
