Yellow Frogs | ‘ఎల్లో కప్ప’లను ఎప్పుడైనా చూశారా..? ఇది కప్పల శృంగారానికి సంకేతమా..?
Yellow Frogs | కప్పలు( Frogs ) ఆకుపచ్చ, గోధుమ రంగులోనే కనిపిస్తుంటాయి. కానీ ఆశ్చర్యంగా ఈ కప్పలు ఎల్లో రంగు( Yellow Frogs )లో కనిపించాయి. ఈ రంగులోకి కప్పలు మారాయంటే.. అవి ఆడ కప్పలతో శృంగారం కోసం ఎదురుచూస్తున్నట్టు అట.

Yellow Frogs | కప్పలు( Frogs ).. వర్షాలు( Rains ) పడ్డాయంటే చాలు కుంటలు, చెరువులు, వాగుల్లో దర్శనమిస్తాయి. బెక బెకమని అరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. గుజరాత్( Gujarat )లోని భరూచ్( Bharuch )లో ఇటీవల తొలకరి జల్లులు కురిశాయి. ఆ వానకు కప్పలు కుప్పలు తెప్పలుగా దర్శనమిచ్చాయి. అయితే ఆ కప్పలు కొత్త రంగులో కనిపించాయి. పసుపు రంగులో కప్పలు( Yellow Frogs ) కుప్పలు తెప్పలుగా కనిపించడంతో.. స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆ కప్పలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి వైరల్ చేశారు.
సాధారణంగా కప్పలు ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ఉంటాయి. కానీ ఈ కప్పలు మాత్రం పూర్తిగా పసుపు రంగులో ఉన్నాయి. వీటిని చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉన్న కప్పలను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ కప్పలను కొందరు అదృష్టంగా భావిస్తే.. మరికొందరు కొత్త రకం జాతి కప్పలు అయి ఉండొచ్చని పేర్కొన్నారు.
ఎల్లో కలర్ కప్పలపై పర్యావరణ వేత్తలు( Environmental experts ) స్పందించారు. వీటిని ఇండియన్ బుల్ ఫ్రాగ్స్( Indian Bullfrogs ) అంటారని పేర్కొన్నారు. సంతానోత్పత్తి సమయంలో కప్పలు తమ రంగును మార్చుకుంటాయని తెలిపారు. భాగస్వామిని ఆకర్షించేందుకు.. మగ కప్పలు పసుపు రంగులోకి మారుతాయని చెప్పారు. ఇది కేవలం వర్షాకాలంలోనే, అది కూడా భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ దృశ్యం కనిపిస్తుందన్నారు. ఇక ఈ కప్పలను టచ్ చేయొద్దని, చిన్న పిల్లలను వాటికి దూరంగా ఉంచాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.
ભરૂચમાં પીળા રંગના દેડકા દેખાતાં લોકોમાં આશ્ચર્ય#CGNews #bharuch #Frog #Yellowfrogs #viralvideo #bharuchNews #bharuchcity pic.twitter.com/mjPN6qMMqM
— ConnectGujarat (@ConnectGujarat) June 18, 2025