ఫ్లేవ‌ర్డ్ కండోమ్స్‌కు యువ‌త బానిస‌..! మ‌త్తు కోసం దాన్నే తాగేస్తున్నార‌ట‌..!!

పెళ్లి కాని అబ్బాయిలు కూడా కండోమ్స్‌కు అల‌వాటు ప‌డ్డారు. అదేదో లైంగిక చ‌ర్య‌కు అనుకుంటే పొర‌పాటే. మ‌రి ఎందుకు కండోమ్స్‌ను వినియోగిస్తున్నారో తెలుసుకుంటే.. మీరు షాక్ అవుతారు.

ఫ్లేవ‌ర్డ్ కండోమ్స్‌కు యువ‌త బానిస‌..! మ‌త్తు కోసం దాన్నే తాగేస్తున్నార‌ట‌..!!

కండోమ్.. ఈ పేరు వినే ఉంటారు. కుటుంబ నియంత్ర‌ణ సాధ‌నం ఇది. సుఖ వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉండేందుకు కండోమ్స్‌ను వినియోగిస్తుంటారు. సురక్షిత శృంగారానికే కాకుండా జీవిత భాగ‌స్వామి గర్భం దాల్చకుండా ఉండేందుకు కూడా కండోమ్‌ను వినియోగిస్తుంటారు. కండోమ్‌ సక్రమంగా వినియోగిస్తే.. మహిళలు గర్భం దాల్చే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. కండోమ్‌ను సరిగా వినియోగించడం వల్ల అది చిరిగిపోకుండా, లీక్ కాకుండా పటిష్టంగా ఉంచుతోంది. కాబ‌ట్టి పెళ్లైన దంప‌తులు కండోమ్‌ను వినియోగిస్తుంటారు. ఇప్పుడు పెళ్లి కాని అబ్బాయిలు కూడా కండోమ్స్‌కు అల‌వాటు ప‌డ్డారు. అదేదో లైంగిక చ‌ర్య‌కు అనుకుంటే పొర‌పాటే. మ‌రి ఎందుకు కండోమ్స్‌ను వినియోగిస్తున్నారో తెలుసుకుంటే.. మీరు షాక్ అవుతారు.

ప‌శ్చిమ బెంగాల్‌లోని దుర్గ‌పూర్‌కు చెందిన యూత్.. ఫ్లేవ‌ర్డ్ కండోమ్స్ బాట ప‌ట్టారు. ఇవి ఎంతో ఫేమ‌స్ కూడా. అయితే దుర్గాపూర్‌కు చెందిన చాలా మంది యువ‌త‌.. స్థానికంగా ఉన్న మెడిక‌ల్ షాపుల్లో పెద్ద ఎత్తున ఫ్లేవ‌ర్డ్ కండోమ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇక ఆ కండోమ్స్‌ను తీసుకెళ్లి.. గోరు వెచ్చ‌ని వాట‌ర్‌లో ఒక గంట పాటు నాన‌బెడుతున్నారు. ఆ త‌ర్వాత ఆ వాట‌ర్‌ను అమాంతం తాగేస్తున్నారు. దాంతో ఆల్క‌హాల్ తాగిన మాదిరి.. మ‌త్తు వ‌చ్చేస్తుంద‌ట‌. ఆ మ‌త్తు దాదాపు 10 నుంచి 12 గంట‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని యువ‌త పేర్కొంటున్నారు.

ఈ విష‌యం ఎలా వెలుగు చూసిందంటే..?

దుర్గాపూర్ ఏరియాలో ఫ్లేవ‌ర్డ్ కండోమ్స్‌కు గిరాకీ బాగా పెర‌గ‌డం, మెడిక‌ల్ షాపుల్లో క్ష‌ణాల్లో అవి అమ్ముడుపోవ‌డంతో.. అస‌లేం జ‌రుగుతుంద‌ని మెడిక‌ల్ షాపుల య‌జ‌మానులు కొంద‌రు క‌న్నేశారు. అది కూడా యువ‌త ఎక్కువ‌గా కొనుగోలు చేయ‌డంతో వారికి మరింత డౌట్ వ‌చ్చింది. దాంతో ఓ షాపు య‌జ‌మాని.. ఫ్లేవ‌ర్డ్ కండోమ్స్ కొనుగోలు చేసేందుకు వ‌చ్చిన ఓ విద్యార్థిని అడిగాడు. అత‌ను ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పేస‌రికి షాపు య‌జ‌మాని షాక్ అయ్యాడు. ఫ్లేవ‌ర్డ్ కండోమ్స్‌ను నాన‌బెట్టిన నీటిని తాగితే ఆల్క‌హాల్ మాదిరి మ‌త్తుగా ఉంద‌ని యువ‌కుడు చెప్పాడు.

ఫ్లేవ‌ర్డ్ కండోమ్సే ఎందుకు..? ఆల్క‌హాలే తాగొచ్చు క‌దా..?

మ‌త్తులో ముంచే ఆల్క‌హాల్ ఖ‌రీదు ఎక్కువే. సిగ‌రెట్లు కూడా కొన‌లేని ప‌రిస్థితి. ఇత‌ర మాద‌క ద్ర‌వ్యాలు తీసుకొలేని ప‌రిస్థితి. ఆల్కహాల్, సిగ‌రెట్ల‌కు డ‌బ్బును అధిక మొత్తంలో ఖ‌ర్చు చేయ‌లేని ప‌రిస్థితి. కాబ‌ట్టి త‌క్కువ ధ‌ర‌కే ల‌భ్య‌మయ్యే ఫ్లేవ‌ర్డ్ కండోమ్స్ కొనుగోలు చేసి మ‌త్తుకు బానిస అవుతున్న‌ట్లు తేలింది. ఈ క్ర‌మంలోనే ఫ్లేవ‌ర్డ్ కండోమ్స్‌కు అల‌వాటు ప‌డిన‌ట్లు విద్యార్థులు పేర్కొన్నారు. కండోమ్స్ కొనుగోలుకు డాక్ట‌ర్ల ప్రిస్కిప్ష‌న్ కూడా అవ‌స‌రం లేదు. కాబ‌ట్టి రోజుకు ఒక ప్యాకెట్ కూడా సేల్ కాని ప‌రిస్థితి నుంచి ఇప్పుడు రోజుకు ఒక్కో విద్యార్థి 3 నుంచి 4 ప్యాకెట్లు కొనుగోలు చేస్తున్న‌ట్లు షాపు నిర్వాహ‌కులు పేర్కొంటున్నారు. ఒక్కోసారి కండోమ్స్ దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

కండోమ్‌లో క్యాన్స‌ర్ కార‌కాలు..?

ఫ్లేవ‌ర్డ్ కండోమ్స్‌లో అధిక మొత్తంలో విష‌పూరిత స‌మ్మేళ‌నాలు ఉంటాయ‌ని మెడికల్ షాపు య‌జమాని తెలిపాడు. ఈ స‌మ్మేళ‌నాలు క్యాన్స‌ర్ కార‌కాలుగా మారి, ఆరోగ్యానికి ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌న్నాడు. ఇలాంటి వ్య‌స‌నాల‌ను మానుకోవాల‌ని హెచ్చ‌రించాడు. ఇప్పుడు ఏదో మ‌త్తులో తేలిపోవ‌చ్చు కానీ భ‌విష్య‌త్‌లో అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశం ఉంద‌న్నాడు.