• భారతీయ హెల్త్‌కేర్ సర్వీసెస్ విభాగంలో తమ ఫండ్స్ ద్వారా 360 వన్ అసెట్‌కి ఇది ఏడో విడత పెట్టుబడి
• ప్రీ-ఐపీవో వ్యూహంలో భాగంగా ఈ పెట్టుబడి పెట్టిన 360 వన్ అసెట్
ముంబై: 360 వన్ WAM అనుబంధ సంస్థ 360 వన్ అసెట్ ఉత్తర భారతదేశంలో అగ్రగామి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చెయిన్ అయిన పారస్ హెల్త్‌కేర్‌లో రూ. 170.60 కోట్ల పెట్టుబడి ప్రక్రియను పూర్తి చేసింది. ప్రాథమిక పెట్టుబడితో పాటు, ప్రస్తుత ఇన్వెస్టరు పాక్షిక నిష్క్రమణతో సెకండరీ పెట్టుబడి పెట్టడం ఇందులో భాగంగా నిల్చాయి.
హెల్త్‌కేర్ సేవల్లో అపార అనుభవమున్న ఎంట్రప్రెన్యూర్ Dr. ధర్మీందర్ నాగర్ నెలకొల్పిన పారస్ హెల్త్‌కేర్ ఉత్తర భారతదేశంలోని ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి నగరాలవ్యాప్తంగా ఎనిమిది ఆస్పత్రుల్లో 2,000 పైగా పడకలను నిర్వహిస్తోంది. అందుబాటు ఖర్చులో, అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో గ్రూప్ పేరొందింది.
“భారతీయ హెల్త్‌కేర్ సర్వీసెస్ విభాగంలో ఇది మాకు ఏడో పెట్టుబడి. దీర్ఘకాలికంగా ఈ రంగం గణనీయంగా వృద్ధి చెందుతుందన్న మా నమ్మకానికి ఇది నిదర్శనం. అంతగా సేవలు అందని కస్టమర్లకు నాణ్యమైన వైద్య సైవలను అందుబాటు వ్యయాల్లో అందించే క్రమంలో పారస్ హెల్త్‌కేర్‌తో జట్టు కట్టడం మాకు గర్వకారణం. మార్కెట్లో అగ్రగామి అయిన మా ప్రీ-ఐపీవో వ్యూహంలో ఈ పెట్టుబడి భాగంగా ఉంటుంది” అని 360 వన్ అసెట్ సీనియర్ ఫండ్ మేనేజర్ & స్ట్రాటెజీ హెడ్ ఉమేష్ అగ్రవాల్ తెలిపారు.