Viral Video | 5 అడుగుల మొస‌లిని.. అమాంతం మింగేసిన కొండ‌చిలువ‌

Viral Video | కొండ‌చిలువ‌ల‌కు జంతువులు క‌నిపిస్తే చాలు.. వాటిని అమాంతం మింగేస్తాయి. ఆ మాదిరిగానే ఓ భారీ కొండచిలువ(Python) ఓ మొస‌లిని మింగేసింది. ఆ త‌ర్వాత జీర్ణించుకోలేక తీవ్ర అయాసంతో ఆ కొండ‌చిలువ చ‌నిపోయింది. చ‌నిపోయిన ఉన్న కొండ‌చిలువ‌ను శాస్త్ర‌వేత్త‌లు ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అనంత‌రం అక్క‌డ కొండచిలువను కోసి చూడ‌గా, శాస్త్ర‌వేత్త‌లు షాక్ అయ్యారు. కొండ‌చిలువ క‌డుపులో 5 అడుగుల పొడ‌వున్న మొస‌లి ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆ మొస‌లి కూడా చ‌నిపోయింది. అయితే మొస‌లిని మింగిన కొండ‌చిలువ […]

Viral Video | 5 అడుగుల మొస‌లిని.. అమాంతం మింగేసిన కొండ‌చిలువ‌

Viral Video |

కొండ‌చిలువ‌ల‌కు జంతువులు క‌నిపిస్తే చాలు.. వాటిని అమాంతం మింగేస్తాయి. ఆ మాదిరిగానే ఓ భారీ కొండచిలువ(Python) ఓ మొస‌లిని మింగేసింది. ఆ త‌ర్వాత జీర్ణించుకోలేక తీవ్ర అయాసంతో ఆ కొండ‌చిలువ చ‌నిపోయింది.

చ‌నిపోయిన ఉన్న కొండ‌చిలువ‌ను శాస్త్ర‌వేత్త‌లు ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అనంత‌రం అక్క‌డ కొండచిలువను కోసి చూడ‌గా, శాస్త్ర‌వేత్త‌లు షాక్ అయ్యారు. కొండ‌చిలువ క‌డుపులో 5 అడుగుల పొడ‌వున్న మొస‌లి ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆ మొస‌లి కూడా చ‌నిపోయింది.

అయితే మొస‌లిని మింగిన కొండ‌చిలువ పొడ‌వు 18 అడుగులు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని ఫ్లోరిడాలో జ‌రిగిన‌ట్లు నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.