Neha Shetty: రాధిక.. అదృష్టం మాములుగా లేదుగా

విధాత: టాలీవుడ్‌లో మరో భామ ప్రత్యేక సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే సమంత, తమన్నా, శ్రీలీల వంటి భామలు కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఐటమ్ సాంగ్స్ చేసి తమ కెరీర్‌ను డెవలప్ చేసుకోగా ఇప్పుడు ఈ జాబితాలో చేరేందుకు చాలా మంది యంగ్ భామలు సైతం సై అంటున్నారు.
ఈక్రమంలో ఇప్పటికే రొమాంటిక్ బ్యూటీ కేతికశర్మ రాబిన్ హుడ్ సినిమాలో ప్రత్యేక గీతం చేయగా, సామజవరగమన బ్యూటీ రెబా మోనిక జాన్ మ్యాడ్ 2 సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి మెప్పించింది. తాజాగా ఈ లిస్టులో డీజే టిల్లు బ్యూటీ నేహాషెట్టి (Neha Shetty) కూడా చేరింది.
పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన మెహబుబా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అందం, అభినయం, గ్లామర్ నిండుగా ఉన్న ఈ బ్యూటీ కేరీర్ మాత్రం అశించినంత వేగంగా లేదు.
సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు (Dj Tillu) సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ భామకు మళ్లీ ఆ రేంజ్‌లో బ్రేక్ ఇచ్చే చిత్రం పడలేదు.
ఈ క్రమంలో తాజాగా ఐటమ్ సాంగ్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అది కూడా సుజిత్ (Sujith), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఓజీ (OG) సినిమాలో.
ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ పనుల్లో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో అమ్మడి రేంజ్ మారిపోయినట్టేనని సినీ లవర్స్ అనుకుంటున్నారు.