Akhil Sreeleela: అఖిల్‌కు.. శ్రీలీల అయినా అదృష్టం తెచ్చేనా

Akhil Sreeleela
ఇప్పటికే అర డజన్ సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల (Sreeleela) మరో క్రేజీ కాంబినేషన్కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అక్కినేని అఖిల్ (Akhil) హీరోగాప్రఖ్యాత అన్నపూర్ణ స్టూడియోస్, సితార సంస్థలు సంయిక్తంగా నిర్మించనున్న సినిమాలో కథానియుకగా డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela) ఎంపికయింది.
ఇప్పటికే నాగ చైతన్యతో సినిమా చేస్తున్న శ్రీలీల ఇప్పుడు అఖిల్‌తో కూడా సినిమా చేయనుండడంతో టాలీవుడ్‌లో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది.
గత సంవత్సరం కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన మురళీకృష్ణ అబ్బూరు ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా లెనిన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక ఇప్పుడు శ్రీలీల అయినా అఖిల్ అదృష్టం మారుస్తుందేమో చూడాలి.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!