Site icon vidhaatha

ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడంపై అవగాహన..

ముంబై: గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (GIG), బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మరియు భామ్లా ఫౌండేషన్ సంయుక్తంగా, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) మద్దతుతో #BeatPlasticPollution అనే ప్రచారాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం, ప్లాస్టిక్ కాలుష్యం వంటి కీలక పర్యావరణ సమస్యలను పరిష్కరించడంపైనా, భూమిపై సమతౌల్యత పునరుద్ధరణ, ప్రాణుల మనుగడకు తోడ్పడటం కోసం నేల, మొక్కలు, ప్రకృతిని పరిరక్షించాల్సిన అవసరంపై అవగాహన పెంచడంపై ప్రధానంగా దృష్టి పెట్టేదిగా ఉంది.

“మానవులు, ప్రకృతికి అత్యంత ప్రాధాన్యతనివ్వడమనేది గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌ పాటించే కీలక విలువల్లో ఒకటి. పర్యావరణహిత విధానాల విషయంలో గత పదేళ్లలో మేము గణనీయమైన పురోగతి సాధించాం. మేము ఉపయోగించే విద్యుత్తులో 64% పునరుత్పాదక ఇంధనం (renewable energy) నుండే వస్తోంది. మేము ఉపయోగించే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ను 20 శాతం పైగా తగ్గించాము. మేము తయారు చేసే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ను పూర్తిగా 100 శాతం తిరిగి సేకరించి, రీసైకిల్ చేస్తాము” అని గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్ (Nadir Godrej) తెలిపారు.

“మేము నిర్వహించే వ్యర్థ నిర్వహణ (waste management) ప్రాజెక్టుల ద్వారా 63,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాన్ని ల్యాండ్‌ఫిల్స్‌కి వెళ్లకుండా ఆపగలిగాం. పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించాం. అర్థవంతమైన విధంగా పర్యావరణ పరివర్తనకు తోడ్పడాలనే మా సంకల్పానికి ఈ క్యాంపెయిన్ కొనసాగింపులాంటిది. ప్లాస్టిక్ కాలుష్యం, పునరుత్పాదక ఇంధనం వంటి సవాళ్లను పరిష్కరించడం ద్వారా సమిష్టి కృషికి ప్రేరణగా నిలవాలని, భవిష్యత్ తరాల కోసం సుస్థిరమైన వారసత్వాన్ని అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం” అని వివరించారు.

భారతదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఒక పెద్ద సమస్య. 2023లో 9.46 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తయ్యాయి, వాటిలో 43% సింగిల్-యూజ్ ప్లాస్టిక్కే. ఈ సమస్యను ఎదుర్కొనటానికి, పర్యావరణహితమైన జీవనశైలిని అవలంబించేలా, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకునేలా, వనరులను పరిరక్షించేలా ఈ క్యాంపెయిన్ ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఈ సందేశాన్ని విస్తృతంగా చేరవేసేందుకు గోద్రెజ్ మాజిక్ రెడీ-టు-మిక్స్ హ్యాండ్ వాష్ స్టేషన్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. వారం రోజుల పైగా ఇది అందుబాటులో ఉంటుంది. బాటిళ్లను హ్యాండ్‌వాష్ స్టేషన్‌లో రీఫిల్లింగ్ చేసుకుని, తిరిగి ఉపయోగించేలా ప్రజలను ప్రోత్యహించేందుకు ఇది తోడ్పడుతుంది. కేవలం రీఫిల్ చేయడం ద్వారా ఒక్కొక్కరు ఏటా ఎంత ప్లాస్టిక్‌ను ఆదా చేయొచ్చనేది తెలియజేసేందుకు గోద్రెజ్ మ్యాజిక్ హ్యాండ్‌వాష్ స్టేషన్‌లో రియల్-టైమ్ డ్యాష్‌బోర్డ్ డిస్‌ప్లే ఉంటుంది.

“భారతదేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల సంక్షోభం వేగంగా పెరుగుతోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత మరియు వ్యాపారం మధ్య సమతౌల్యత పాటిస్తూ పర్యావరణహితమైన సంస్కృతిని జీసీపీఎల్ పెంపొందిస్తోంది. గోద్రెజ్ మాజిక్ హ్యాండ్ వాష్ అనేది సాధారణ హ్యాండ్ వాష్ కంటే 50% తక్కువ ప్లాస్టిక్, 75% తక్కువ ఇంధనం, మరియు 75% తక్కువ కాగితాన్ని ఉపయోగిస్తుంది. బాటిళ్లను తిరిగి ఉపయోగించడంలాంటి చిన్నపాటి చర్యలు సైతం అర్థవంతమైన, పెద్ద మార్పును ఎలా తేగలవనేది ఈ క్యాంపెయిన్ తెలియజేస్తుంది. రీఫిల్‌ను ఉపయోగించిన ప్రతిసారి ల్యాండ్‌ఫిల్‌కి వెళ్లే ఒక బాటిల్ తగ్గినట్లు లెక్క. రియల్ టైమ్‌లో ఈ ప్రభావాన్ని విజువలైజ్ చేసుకోవడం ద్వారా అవగాహనను ఆచరణలోకి పెట్టడం వీలవుతుంది” అని గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (GCPL) పర్సనల్ కేర్ విభాగం మార్కెటింగ్ హెడ్ నీరజ్ సెంగుట్టువన్ (Neeraj Senguttuvan) తెలిపారు.

Exit mobile version