Site icon vidhaatha

సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల యాక్ట్ -2003(కొట్పా) పై మరింత అవగాహన పెరగాలి 

విధాత: కొట్పా పై స్కూళ్ల అధిపతులకు జాతీయ స్థాయిలో 85 శాతం మేర అవగాహన ఉంది.కొట్పా పై ఏపీలో స్కూళ్ల అధిపతులకు 49 శాతం మేర మాత్రమే అవగాహన ఉండడం గమనార్హం,అవగాహన పెంచేందుకు అధికారులు మరింతగా కృషి చేయాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్.

గ్లోబల్ యూత్ టుబాకో సర్వే ఏపీ ఫ్యాక్ట్ షీట్ ను మంగళగిరి ఎపిఐఐసి బిల్డింగ్ 5వ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్లో ఆవిష్కరించిన కమీషనర్, పొగాకు ఉత్పత్తుల వాడకంలో ఏపీ చిన్నారులు చివరి స్థానంలో ఉండడం మంచి పరిణామమని వెల్లడించారు.

పాఠశాల స్థాయి పిల్లలపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ 2019లో సర్వే చేసింది.సర్వేలో 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సున్న బాల బాలికల్ని కలిసి వివరాల్ని సేకరించారు.

Exit mobile version