కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

విధాత: రూ.1332 కోట్లతో తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104కిలోమీటర్ల డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Astrwini Vaishnaw) తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించి అమోదం తెలిపారు. కేబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రాజెక్టులకు పెద్దపీట వేయడం విశేషం. కేబినెట్ ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలనుఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు.
“తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ పనులతో పర్యాటకంగా ఎంతో అభివృద్ధి జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తారని… తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోటలు తిరుపతి-పాకాల-కాట్పాడి డబ్లింగ్ ప్రాంతంలోనే ఉన్నాయని గుర్తు చేశారు. తిరుపతి-వెల్లూరు మార్గం వైద్య, విద్య పరంగా ఎంతో కీలకమని తెలిపారు.
తిరుపతి-పాకాల- కాట్పాడి డబ్లింగ్ పనులతో 400 గ్రామాల్లోని 14 లక్షల మంది జనాభాకు లబ్ది చేకూరుతుందన్నారు . 35 లక్షల పనిదినాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరకు రవాణాకు అవకాశం ఉంటుంది” అని కేంద్ర మంత్రి వెల్లడించారు.
తిరుపతి-పాకాల-కాట్పాడి ప్రాజెక్టులో 17మేజర్, 327మైనర్ వంతెనలు, 7 ఫైవోవర్స్, 30అండర్ పాస్ లు నిర్మించనున్నట్లుగా తెలిపారు. ఈ డబ్లింగ్ పనులు పూర్తయితే రోడ్డు మార్గం మీద రద్ధీ తగ్గి రైలు మార్గం ఎక్కువ వినియోగంలోకి వస్తుందని తెలిపారు.