Site icon vidhaatha

Tariffs | ట్రంప్‌కు.. చైనా టారిఫ్ కౌంటర్ !

విధాత: ప్రపంచ దేశాలపై అధిక సుంకాల విధింపుతో విరుచుకు పడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు డ్రాగన్ దేశం చైనా ధీటైనా కౌంటర్ ఇచ్చింది. చైనా దిగుమతులపై ట్రంప్ 104శాతం సుంకాల విధించాడు. బదులుగా అమెరికా వస్తువులపై చైనా 34శాతం నుంచి 84శాతానికి సుంకాలు పెంచి ఆగ్ర రాజ్యానికి షాక్ ఇచ్చింది.

సుంకాల విధింపులో అమెరికాకు ఏ మాత్రం తగ్గేదేలే అంటూ చైనా వ్యవహరిస్తున్న తీరుతో రెండు దేశాల మధ్య ఢీ అంటే ఢీ అన్న వాతావారణం నెలకొంది. ప్రతికార సుంకాలతో రెండు దేశాలు వాణిజ్య యుద్దానికి దిగాయి.

ట్రంప్ బెదిరింపులకు లొంగేది లేదని తమ దేశ వాణిజ్య హక్కులను కాపాడుకుంటామని చైనా ప్రకటించింది. చైనాతో పాటు వివిధ ప్రపంచ దేశాలపై అమెరికా పెంచిన సుంకాలు ఏప్రిల్ 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేపట్టిన అధిక సుంకాల అరాచకాన్ని అడ్డుకునేందుకు భారత్ చైనా కలిసి పోరాడాలని భారత్ లోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు.

అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదిరిన తరుణంలో చైనా నుంచి ఈ పిలుపు రావడం విశేషం. భారత్ చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కావడంతో రెండు కలిసి పనిచేస్తే ఆమెరికా ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవచ్చని చైనా భావిస్తుంది.

Exit mobile version