China Special School | టీనేజీలోకి అడుగుపెట్టిన తర్వాత చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మాటలను పట్టించుకోకుండా తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తుంటారు. ఏ చిన్న విషయానికైనా కోప్పడటం, తల్లిదండ్రులు నియంత్రిస్తున్నారనే భావనతో వాదనకు దిగుతుంటారు. అలాంటి పిల్లలకు బుద్ధి చెప్పేందుకు చైనాలోని ఓ పాఠశాల వినూత్న నిర్ణయం తీసుకుంది. రెబల్ లక్షణాలు ఉన్న విద్యార్థులకు ఒక్కొక్కరికీ రెండున్నర కిలోల బరువు ఉన్న బొమ్మను ఇచ్చి వాటిని వారం రోజుల పాటు తమ బిడ్డల్లా కంటికి రెప్పలా కాపాడాలని పనిష్‌మెంట్ ఇస్తుంది. ఈ ప్రత్యేక శిక్షణ ఇప్పుడు సోషల్‌వీడియాలో వైరల్‌గా మారింది.
తూర్పు చైనా జియాంగ్స్ ప్రావిన్స్‌లోని జుజౌ నగరంలో ఉన్న యువాన్‌జోంగ్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్‌లో ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారుక. చదువుపై ఆసక్తి లేకపోవడం, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస కావడం, కోప స్వభావం ఎక్కువగా ఉండటం, చిన్న వయసులోనే ప్రమలో పడటం వంటి సమస్యల్లో చిక్కుకున్న టీనేజీ విద్యార్థులను ఈ పాఠశాలలో చేర్పిస్తుంటారు.
ఇక్కడ పనిష్‌మెంట్‌లో భాగంగా ప్రతి విద్యార్థికి సుమారు 2.5కిలోల బరువు ఉన్న బేబీ డాల్‌ను అందజేస్తారు. వారంతా ఆ డాల్స్‌ను తమ వీపుపై కట్టుకుని రోజంతా తమతో తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్లాస్‌రూంలో కూర్చున్నా, భోజనం చేసినా, నడిచినా వాటిని తమ పిల్లల్లా చూసుకోవాల్సిందే. అలా ఒక వారం రోజులా పాటు ఆ డాల్స్‌ను వారు నిజమైన పిల్లల్లా సంరక్షించాల్సి ఉంటుంది. వాటి నిద్ర, ఆహారం, రాత్రి అవసరాలు అన్నింటినీ పట్టించుకోవాలని ఆదేశిస్తారు.
దీనివల్ల పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులు పడే కష్టాలు అర్థమవుతాయని.. అందుకే ఇలాంటి వినూత్న కార్యక్రమం చేపట్టామని స్కూల్ టీచర్లు చెప్పినట్లుగా స్థానిక మీడియా తెలిపింది. తల్లిదండ్రుల శ్రమనున ప్రత్యక్షంగా అనుభవిస్తే పిల్లల్లో బాధ్యత పెరుగుతుందని పాఠశాల ప్రిన్సిపాల్ డూ తెలిపారు.
అయితే ఈ విధానంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ డాల్స్ నిజమైన చిన్నారుల్లా ఏడవవు, రాత్రిళ్లు నిద్రపోవు.. దీనివల్ల కష్టాలు పూర్తిగా తెలియవు కదా అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. ఈ అనుభవాల వల్ల భవిష్యత్తులో పిల్లలనున కనాలనే ఆసక్తి కూడా యువతలో తగ్గిపోవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. చైనాలో నిర్వహిస్తున్న ఇలాంటి ప్రత్యేక శిక్షణా కేంద్రాలపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. కఠిన క్రమశిక్షణ, సైనిక శిక్షణ తరహా విధానాలు అమలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
Read More:
Viral Video | పెళ్లి మండపంలో స్విగ్గీ డెలివరీ బాయ్.. వీడియో వైరల్
