Gen Z | ఎస్కలేటర్‌పై ఛేజింగ్‌లు.. ఫుడ్‌కోర్టులో ఫైటింగ్‌లు.. షాపింగ్ మాల్స్‌లో పబ్‌జీ గేమ్ ఆడేస్తున్న జెన్‌జీ!

చైనాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ వైరల్‌గా మారింది. ప్రముఖ నగరాల్లో ఎక్కడైనా షాపింగ్ మాల్స్ ఖాళీగా, జనాలు లేకుండా ఉంటే చాలు జెన్‌జీ యువత వాటిని బ్యాటిల్ ఫీల్డ్‌గా మార్చుకుని రియల్ లైఫ్‌లో పబ్‌జీ గేమ్ ఆడేస్తున్నారు. ఎస్కలేటర్లపై చేజింగ్‌లు చేస్తూ, ఒక్కో ఫ్లోర్ ఎక్కుతూ ఫైట్‌లు కూడా చేసేస్తున్నారు.

Gen Z | ఎస్కలేటర్‌పై ఛేజింగ్‌లు.. ఫుడ్‌కోర్టులో ఫైటింగ్‌లు.. షాపింగ్ మాల్స్‌లో పబ్‌జీ గేమ్ ఆడేస్తున్న జెన్‌జీ!

Gen Z | PUBG గేమ్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. బ్యాటిల్ ఫీల్డ్‌లో పోరాటాలు, ఛేజ్‌లు, సర్వైవల్ టాస్క్‌లతో ఈ గేమ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. యూత్ దీనికి బానిసలుగా మారుతుండటంతో పలు దేశాలు ఈ గేమ్‌పై నిషేధం కూడా విధించాయి. అలాంటి పబ్‌జీని చైనాలోని జెన్‌జీ యువత రియల్ లైఫ్‌లోనే ఆడేస్తోంది. ఖాళీగా ఉన్న షాపింగ్ మాల్స్‌ను బ్యాటిల్ రాయల్ అరేనాలుగా మార్చేసి.. నిజంగానే పరుగులు, టీమ్ ఫైట్లతో గేమ్‌ను అనుభవిస్తున్నారు. ఈ వినూత్న ట్రెండ్ చైనాలో వైరల్‌గా మారింది.

ఖాళీ మాల్స్‌ టార్గెట్!

చైనాకు చెందిన జెన్‌‌జీ ప్లేయర్లు రాత్రివేళలో షాపింగ్ మాల్స్‌ను బ్యాటిల్ రాయల్ (Battle Royale) అరెనాలుగా మార్చేస్తున్నారు. ఖాళీగా ఉన్న షాపింగ్ మాల్స్‌లో పబ్‌జీ తరహా నిజ జీవిత పోరాట ఆటలను నిర్వహిస్తున్నారు. బీజింగ్, షాంఘై, కింగ్‌డావో వంటి ప్రధాన నగరాల్లో ఈ గేమ్‌ను నిర్వహిస్తున్నారు. సాధారణంగా రాత్రి వేళల్లో లేదా రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో ఈ సెషన్స్ నిర్వహిస్తున్నారు.

రియల్ లైఫ్ బ్యాటిల్ ఫీల్

ఈ ఆటలో పాల్గొనే వారు నాలుగు గోడల మధ్య మొబైల్ స్క్రీన్‌కు పరిమితం అవ్వరు. నిజంగా షాపింగ్‌ మాల్స్‌లోని ఫ్లోర్స్, ఎస్కలేటర్స్, ఫుడ్‌ కోర్టుల్లో పరుగులు తీస్తూ, ఫైటింగ్‌లు చేస్తారు. సోఫాలో కూర్చొని ఏఆర్‌లో ఫీలవ్వడం కాకుండా.. సేఫ్ జోన్, పాయిజన్ సర్కిల్, టీమ్ కాంబాట్ వంటి పబ్‌జీలో ఉండే ఫీచర్లను నిజజీవితంలోనే ఆస్వాదిస్తున్నారు.

ఫన్‌తో పాటు ఫిట్‌నెస్ కూడా!

ఈ పబ్‌జీ గేమ్‌ ఒక్కో సెషన్‌లో 40 నుంచి 60 మంది వరకు యువతీయువకులు పాల్గొంటారు. ఒక్కో సెషన్ దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ ఆటలో భాగంగా ఒక్కో వ్యక్తి ఐదు కిలోమీటర్లకు పైగా పరిగెత్తాల్సి వస్తుంది. దీంతో ఈ ఆట కేవలం ఫన్ ఇవ్వడమే కాకుండా.. ఫిట్‌‌నెస్ పెంచే వ్యాయామంగా కూడా మారుతోంది.

 

ఇది మంచికే!

మొబైల్‌లో పబ్‌జీ ఆడి యూత్ బానిసలుగా మారిపోతున్నారని బ్యాన్ చేస్తుంటే.. రియల్ లైఫ్‌లోకి కూడా ఈ గేమ్‌ను తీసుకురావడమేంటని చాలామంది అనుకోవచ్చు. కానీ దీని వెనుక మంచి కూడా ఉంది. కరోనా తర్వాత చైనాలోని చాలా మాల్స్‌కు సందర్శకులు రావడం తగ్గిపోయింది. దీంతో వాటి నిర్వహణ కూడా భారమైపోయి వాటి యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి మాల్స్‌లో ఇలాంటి రియల్ లైఫ్‌ పబ్‌జీ సెషన్లు నిర్వహించడం వల్ల వాటికి ఆదాయం సమకూరుతుంది.

ఇక యువతకు ఇది కేవలం గేమ్ మాత్రమే కాకుండా.. కొత్త స్నేహాలు చేసుకోవడానికి, సోషల్ ఇంటరాక్షన్‌కు వేదికలుగా మారుతున్నాయి. కేవలం ఫన్ మాత్రమే కాకుండా, కొత్త స్నేహాలు, ఫిట్‌నెస్ ఒకే చోట అందుతుండటంతో ఈ ట్రెండ్ ఇప్పుడు చైనాలో వైరల్‌గా మారింది.

Read More:

శవం ముందు మహిళలతో అర్ధనగ్న నృత్యాలు.. థాయ్‌లాండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ వైరల్

Viral Video | పెళ్లిలో ఇవేం అతిథి మర్యాదలు..! పొట్టి దుస్తుల్లో యువతులతో డ్రింక్స్ సర్వ్.. వీడియో వైరల్