Viral Video | పెళ్లిలో ఇవేం అతిథి మర్యాదలు..! పొట్టి దుస్తుల్లో యువతులతో డ్రింక్స్ సర్వ్.. వీడియో వైరల్

Viral Video | ఓ పెళ్లిలో అతిథి మర్యాదలు చేసేందుకు హోవర్డ్ బోర్డులపై యువతులను ఏర్పాటు చేశారు. మెరిసే, పొట్టి దుస్తుల్లో ఉన్న అమ్మాయిలు కూల్ డ్రింక్స్ అందిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video | పెళ్లిలో ఇవేం అతిథి మర్యాదలు..! పొట్టి దుస్తుల్లో యువతులతో డ్రింక్స్ సర్వ్.. వీడియో వైరల్

Viral Video | ఇప్పుడు చాలామంది పెళ్లిళ్లలో సంప్రదాయం కంటే కూడా ఆడంబరాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందరికంటే తమ వివాహ వేడుక వినూత్నంగా కనిపించాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం నానా స్టంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ పెళ్లిలో అతిథి మర్యాదలు చేసేందుకు హోవర్డ్ బోర్డులపై యువతులను ఏర్పాటు చేశారు. మెరిసే, పొట్టి దుస్తుల్లో ఉన్న అమ్మాయిలు కూల్ డ్రింక్స్ అందిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలు పలువురు అమ్మాయిలు ఒకే తరహాలో మినీ డ్రెస్సులు ధరించారు. వారు స్పోర్ట్స్ షూ ధరించి హోవర్ బోర్డులపై కల్యాణ మండపం మొత్తం తిరుగుతూ.. అతిథులకు కావాల్సిన డ్రింక్స్‌ను అందించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో పోస్టు చేశాడు. ధనవంతుల పెళ్లిళ్లలో ఏదైనా జరుగుతందని క్యాప్షన్ పెట్టాడు. ఇది కాస్త ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ వీడియోను చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.

 


ఇది అవసరం లేని ఆడంబరమని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. చాలా అసహ్యకరమైన ప్రవర్తన.. అసలు ఇలాంటివి అవసరమే లేవని కొందరు అనగా.. ఇలా చేయాల్సి వచ్చిన అమ్మాయిల పరిస్థితి చూస్తుంటే బాధేస్తుందని మరొకరు రాసుకొచ్చారు. పెళ్లి ఒక వ్యాపారంగా మారినప్పుడు ఇలాంటి అర్థం లేని పనులే జరుగుతాయని మరికొందరు అభిప్రాయపడ్డారు.

Read More:

Viral Video | నడిరోడ్డుపై ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమ జంట.. ఎడ్యుకేషన్ హబ్‌లో వైరల్ వీడియో

Weigh Loss | బరువు తగ్గేందుకు వింత ట్రెండ్.. ప్లాస్టిక్ కవర్లు నములుతున్న యూత్!