శవం ముందు మహిళలతో అర్ధనగ్న నృత్యాలు.. థాయ్‌లాండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ వైరల్

థాయ్‌లాండ్‌లో ఓ వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా అతని ఫ్యామిలీ చేసిన పని ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా చనిపోయింది. మరణించిన వ్యక్తికి ఏడుస్తూ వీడ్కోలు పలకడానికి బదులు.. శవపేటిక ముందు ముగ్గురు యువతులతో అశ్లీల డ్యాన్స్‌లు చేయించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

శవం ముందు మహిళలతో అర్ధనగ్న నృత్యాలు.. థాయ్‌లాండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ వైరల్

సాధారణంగా అంత్యక్రియలు అంటే ఏడుపులు, పెడబొబ్బలు ఉంటాయి. మరణించిన వారితో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ విచారంగా కనిపిస్తారు. అయితే థాయ్‌లాండ్‌లో మాత్రం ఓ వ్యక్తి మరణిస్తే అతని కుటుంబసభ్యులు అందమైన అమ్మాయిలతో అర్ధ నగ్నంగా డ్యాన్స్‌లు చేయించారు. ఈ అసాధారణ నిర్ణయం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

దక్షిణ థాయ్‌లాండ్‌లోని సఖోన్ సి థమ్మరాట్ ప్రావిన్స్ రోన్ ఫిబున్‌కు చెందిన ఓ 59 ఏళ్ల వ్యక్తి ఇటీవల మరణించాడు. అయితే అతను చనిపోయే ముందు తన ఫ్యామిలీని ఓ కోరిక కోరాడు. అందరిలాగా తనను ఏడుస్తూ వీడ్కోలు పలకవద్దని.. ఆనందంగా వీడ్కోలు పలకాలని అడిగాడు. ఆ వ్యక్తి చివరి కోరికను నెరవేర్చడం కోసం అంత్యక్రియలకు ఆ ఫ్యామిలీ ముగ్గురు మహిళా డ్యాన్సర్లను పిలిపించింది.

స్థానిక బౌద్ధ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు ముగిసిన తర్వాత ముగ్గురు కోయేటి డ్యాన్సర్లతో నృత్య ప్రదర్శన చేయించారు. ముగ్గురు యవతులతో శవపేటిక ముందు డ్యాన్స్‌లు వేయించారు. అంతేకాదు దాన్ని సోషల్‌మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో చాలామంది ఆ కుటుంబం నిర్ణయాన్ని ప్రశంసిచారు. దుఖంలో కూరుకుపోవడం కంటే ఈ విధంగా సాగనంపడం మేలు అని పలువురు అభిప్రాయపడ్డారు.

అయితే ఆ సమయంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఆ అంత్యక్రియల్లో ఉండటంతో ఈ మహిళా డ్యాన్సర్ల అశ్లీల నృత్యాలపై ఇప్పుడు విమర్శలు కూడా వస్తున్నాయి. అంత్యక్రియల వంటి గంభీరమైన కార్యక్రమంలో ఇలాంటి ప్రదర్శనలు తగవని అంటున్నారు. చివరి కోరిక అయినప్పటికీ చిన్న పిల్లల సమక్షంలో ఇలాంటి కార్యక్రమం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు.

Read More:

Viral Video | పెళ్లిలో ఇవేం అతిథి మర్యాదలు..! పొట్టి దుస్తుల్లో యువతులతో డ్రింక్స్ సర్వ్.. వీడియో వైరల్