Chamala: కేసీఆర్ ఓపెన్ కోర్టుకు ఎందుకు పోలే?

Chamala: కేసీఆర్ ఓపెన్ కోర్టుకు ఎందుకు పోలే?

– వన్ టు వన్ విచారణ ఎందుకు కోరుకున్నారు
– ప్రభుత్వానికి కుట్ర చేయాల్సిన అవసరం లేదు
– చైనాలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కడితే ఉరే..
– కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు

Chamala:  విధాత, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా కేసీఆర్ వన్ టు వన్ విచారణకు ఎందుకు హాజరయ్యారని .. ఓపెన్ కోర్టుకు ఎందుకు పోలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఫెయిల్యూర్ అని అభివర్ణించారు. కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు.

కేసీఆర్ మీద కుట్ర చేయాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. చైనాలో ఇటువంటి ప్రాజెక్టు కట్టి ఉంటి కేసీఆర్ ను ఈ పాటికి ఉరితీసేవాళ్లని పేర్కొ్న్నారు. కాళేశ్వరం విచారణకు హాజరైన వాళ్లంతా ఓపెన్ కోర్టు విచారణకే వచ్చారని.. కేసీఆర్ మాత్రమే వన్ టు వన్ విచారణకు హాజరయ్యారని పేర్కొన్నారు. కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ప్రభుత్వానికి కుట్ర చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని అన్నారు.

తెలంగాణను అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నిజంగానే లక్షల ఎకరాలకు నీరు అంది ఉంటే తాము కూడా సంతోషించేవారని చెప్పారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుతో నష్టమే తప్ప లాభం జరగలేదని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీఆర్ ఎస్ ఇప్పుడు నీతి వ్యాఖ్యలు చెబుతుండటం ఆశ్చర్యంగా ఉందన్నారు.