హాష్ అయిల్ అంతర్ రాష్ట్ర స్మగ్లింగ్‌ ముఠా అరెస్టు.. రెండున్నర కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారి భారీ స్థాయిలో హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుండి తీసిన నూనె) స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేశారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారి భారీ స్థాయిలో హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుండి తీసిన నూనె) స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేశారు. వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్‌గంజ్ పోలీసులు సంయుక్తంగా కలసి ఈ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా నుండి పోలీసులు సుమారు రూ.2 కోట్ల 50లక్షల విలువ గల హాష్ ఆయిల్‌తో పాటు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. హంటల్ సన్ను (23), సువ్వపల్లి గ్రామం, చిత్రకొండ మండలం, మల్కాన్‌గిరి జిల్లా, ఒడిషా రాష్ట్రం 2.హంటల్ సన్యాసి (23), రేకపల్లి, చిత్రకొండ మండలం, మల్కాన్‌గిరి జిల్లా, ఒడిషా రాష్ట్రం, 3. కండెల చిన్నబాబు (56), దారకొండ గ్రామం, గూడెం మండలం, అల్లూరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 4.కష్ణా హంటల్ (56), రేకపల్లి, చిత్రకొండ మండలం, మల్కాన్‌గిరి జిల్లా, ఒడిషా రాష్ట్రానికి చెందిన వారిని పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు కిలో పాండు ప్రస్తుతం పరారీ వున్నాడు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వివరాలను తెలియజేశారు. ఈ ముఠా సభ్యులు గంజాయి మొక్కలను ద్వారా 40కిలోల హాష్ అయిల్‌ను సేకరించారు. ప్యాకేట్లలో ఐదు కిలోల చోప్పున భద్రపరిచిన హాష్ అయిల్‌ను తీసుకోని ముంబాయిలో విక్రయించేందుకు ఏపీలోని తుని రైల్వే స్టేషన్ నుండి ఈ నెల 19 తేదీన కోనార్క్ రైలులో బయలు దేరారు. వరంగల్ రైల్వే స్టేషన్ లో సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండటంతో స్టేషన్‌లో దిగారు. మంగళవారం ఉదయం ముంబాయి వేళ్ళేందుకు ఈ ముఠా వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్ పరిసరాల్లో అనుమాస్పదంగా తిరుగుతుండగా అరెస్టు చేసి, హాష్ అయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వారిని సీపీ అభినందించారు.

Latest News